EPAPER

Naga Babu : పోలీసు పాత్రలపై వివాదాస్పద వ్యాఖ్యలు .. క్షమాపణలు చెప్పిన నాగబాబు..

Naga Babu : పోలీసు పాత్రలపై వివాదాస్పద వ్యాఖ్యలు ..  క్షమాపణలు చెప్పిన నాగబాబు..

Naga Babu comments


Naga Babu: సినీ నటుడు నాగబాబు కామెంట్స్ ఎప్పుడూ వివాదాలు రేపుతూనే ఉంటాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్ స్పందించని విషయాల్లోనూ నాగబాబు రియాక్ట్ అవుతూ ఉంటారు. మెగా ఫ్యామిలీ తరఫున తన వాయిస్ ను బలంగా వినిపిస్తూ ఉంటారు. అలాగే తన తమ్ముడు పవన్ కల్యాణ్ పెట్టిన పార్టీ జనసేనలో చేరిన తర్వాత నాగబాబు రాజకీయ విమర్శలు ఘాటుగా చేస్తున్నారు. వైసీపీపై విమర్శానాస్త్రాలు సంధిస్తుంటారు. ఇప్పుడు తన కొడుకు సినిమా ఈవెంట్ లో నాగబాబు చేసిన కామెంట్ కాంట్రవర్శీని సృష్టించాయి. ఈ నేపథ్యంలో తన తప్పును గ్రహించిన నాగబాబు వెంటనే క్షమాణలు కూడా చెప్పేశారు.

అసలేం జరిగిందంటే.. ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రీరిలీజ్ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో నాగబాబు వివాదాస్పద కామెంట్స్ చేశారు. పోలీసు పాత్రలు ఎవరూ చేస్తే బాగుంటుందనే విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పారు. ఖాకీ పాత్రలకు 6 అడుగుల 3 అంగుళాలు ఉన్న నటులు చేస్తే సూటవుతుందని స్పష్టంచేశారు. అంతవరకు బాగానే ఉంది. ఆ మాటతో నాగబాబు ఆపేస్తే వివాదం రేగిది కాదు. ఆయన అలా చేయలేదు. మరో అడుగు ముందుకేశారు. తక్కువ ఎత్తు ఉండే హీరోలను ఉద్దేశించి మాట్లాడారు. 5 అడుగుల 3 అంగుళాలు ఉండే నటులు పోలీసు పాత్రలు చేస్తే బాగుండదంటూ కాంట్రవర్శీ కామెంట్స్ చేశారు.


నాగబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలామంది దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. కొందరైతే నాగబాబు తీరును తప్పుబట్టారు. మెగా ఫ్యామిలీలోని చిరంజీవి, పవన్ కల్యాణ్, రాంచరణ్ కూడా పోలీసు పాత్రలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వారంతా 6 అడుగుల 3 అంగుళాలు లేరు కదా అని ప్రశ్నించారు. తన కొడుకు వరుణ్ తేజ్ హైట్ ఎక్కువ ఉన్నంత మాత్రమా మిగతావారిని తక్కువ చేయలా అంటూ నాగబాబును నెటిజన్లు ప్రశ్నించారు.

Read More: సింగర్ చిన్మయిపై కేసు.. దేశంపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్..

ఇలా అన్ని వైపులా నుంచి విమర్శలు రావడంతో నాగబాబు తన తప్పు తెలుసుకున్నారు. సోషల్ మీడియాలోనే క్షమాపణలు చెప్పారు. ఈ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఓ నోట్ రిలీజ్ చేశారు.  నాగబాబు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ నోట్‌ను విడుదల చేశారు. ఈ నోట్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు.

తన మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుంటే క్షమించాలని నాగబాబు కోరారు. ఆపరేషన్ వాలంటైన్ ప్రీరిలీజ్ వేడుకలో యాదృచ్ఛికంగా మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. కావాలని ఎవరనీ ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు. తనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాంటూ నోట్ లో పేర్కొన్నారు.

ఆపరేషన్ వాలంటైన్ హీరో వరుణ్ తేజ్ కూడా నాగబాబు వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు. హైట్ గురించి తన తండ్రి నాగబాబు ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. తన ఎత్తును దృష్టిలో పెట్టుకొని చిన్న పోలిక చేశారని తెలిపారు. ఏ కథానాయకుడిని కించపరిచే ఉద్దేశం తన తండ్రికి లేదని చెప్పుకొచ్చారు.

శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా డైరెక్షన్ రూపొందిన మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఇందులో వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించాడు. 2019 పుల్వామా దాడి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో మానుషి చిల్లర్‌ హీరోయిన్ గా నటించింది. మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ అయ్యింది.

Tags

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×