EPAPER

Himachal Pradesh : రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు..

Himachal Pradesh : రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు..

Himachal Pradesh speaker Kuldeep Singh Pathania


Himachal Pradesh speaker Kuldeep Singh Pathania: హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయం కొత్త ములుపులు తిరుగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారని తక్షణపై వారిపై అనర్హత వేటు వేస్తున్నానని స్పీకర్ ప్రకటించారు.

మరోవైపు హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సుఖు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులతోనూ సమావేశమయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లో ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ సమయంలో బీజేపీకి అనుకూలంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటు వేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు.


అనర్హత వేటు పడినవారిలో ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్‌పూర్ ఎమ్మెల్యే రాజిందర్ రాణా, బర్సార్ ఎమ్మెల్యే ఇందర్ దత్ లఖన్‌ పాల్, లాహౌల్-స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ , కుట్లేహర్ ఎమ్మెల్యే దేవిందర్ భుట్టో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించినట్లు సభా వ్యవహారాల మంత్రి హర్షవర్ధన్ చౌహాన్ దాఖలు చేసిన పిటిషన్‌లో వెల్లడైందని స్పీకర్ చెప్పారు.

Read More: టీఎంసీ నేత షేక్ షాజహాన్ అరెస్ట్.. 10 రోజుల పోలీసు కస్టడీ..

ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మంత్రి హర్షవర్ధన్ చౌహాన్ అనర్హత పిటిషన్‌ను దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరతను సవాల్ చేస్తూ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో  అంతర్గత గందరగోళాన్ని సృష్టించారని పేర్కొన్నారు. 68 మంది సభ్యులతో కూడిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ పూర్తి మెజారిటీ ఉంది. బీజేపీకి 25 మంది సభ్యుల బలం ఉంది. అలాగే ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కాషాయ పార్టీకి ఉంది. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి 28 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది.

ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ దుష్ప్రవర్తన, గందరగోళానికి కారణమైనందుకు 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌కు దారితీసింది. సస్పెండ్ అయిన వారిలో ప్రతిపక్ష నాయకుడు జై రామ్ ఠాకూర్, ఇతర కీలక బీజేపీ సభ్యులు ఉన్నారు.

మొత్తంమీద హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.  మంగళవారం సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామా చేశారంటూ వార్తలు వచ్చాయి. అదే సమయంలో రెబల్ ఎమ్మెల్యేలో ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంతకు సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుపైనా రెబల్ ఎమ్మెల్యే విమర్శలు చేశారు. ఓ మంత్రి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

హిమాచల్ ప్రదేశ్ లో జరగుతున్న పరిమాణాలపై కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. కీలక నేతలను ఆ రాష్ట్రానికి పంపింది. రెబల్ నేతలను దారికి తెచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నాలు విఫలయ్యాయి. ఈ క్రమంలో ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్  కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×