EPAPER

Raghurama Krishna Raju: నరసాపురం నుంచే ఎంపీగా పోటీ.. తాడేపల్లిగూడెం సభలో రఘురామకృష్ణరాజు క్లారిటీ..

Raghurama Krishna Raju: నరసాపురం నుంచే ఎంపీగా పోటీ.. తాడేపల్లిగూడెం సభలో రఘురామకృష్ణరాజు క్లారిటీ..

 


Raghurama Krishna Raju Speech

Raghurama Krishna Raju Speech(AP election updates): నర్సాపురం నుంచి ఎంపీగా మళ్లీ బరిలోకి దిగుతానని రఘురామకృష్ణరాజు ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఏ పార్టీలో చేరతారనేది ఇంకా స్పష్టతలేదు. కానీ పోటీపై మాత్రం క్లారిటీ ఆయనే ఇచ్చేశారు. మరి రఘురామ టీడీపీలో చేరతారా? జనసేన కండువా కప్పుకుంటారా? తిరిగి బీజేపీ గూటికి చేరతారా అనేది ఆసక్తిగా మారింది.


సభe వేదికపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలోనే రఘురామకృష్ణరాజు తనపై పోటీపై స్పష్టమైన ప్రకటన చేశారు. అంటే ఆయనకు ఎంపీ సీటు ఖాయమైందని తేలిపోయింది. కానీ ఏ పార్టీ నుంచి అనేది తేలాల్సి ఉంది. ఏ పార్టీలోనూ ఇంకా చేరకున్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగమయ్యేందుకు తాడేపల్లిగూడెం సభకు వచ్చానని రఘురామ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ను అభినందించడానికే వచ్చానని చెప్పారు.

ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి సభా వేదికపై రఘురామకృష్ణరాజు ఘాటు విమర్శలు గుప్పించారు. ఏపీని సర్వనాశనం చేసిన నాయకుడిని గద్దె దించాల్సిందేనని స్పష్టంచేశారు. త్వరలోనే తాను ప్రజల్లో తిరుగుతానన్నారు.

Read More: మా పొత్తు అధికారం కోసం కాదు.. రాష్ట్రాన్ని కాపాడేందుకే.. చంద్రబాబు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తన వాగ్ధాటితో నిత్యం వార్తల్లో ఉండే నాయకుడు. వైసీపీ నుంచే 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచినా రెబల్ మారారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఒంటి కాలిపై లేస్తారు. ఏపీలో అధికార పార్టీపై నిత్యం విమర్శలు చేయడం ఆయన గత నాలుగేళ్లుగా నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వంలోని లోపాలు ఎత్తిచూపుతా ఆ పార్టీ నేతలకు కంటిమీద కనుకు లేకుండా చేశారు.

రఘురామకృష్ణరాజు ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ వాటిని ధీటుగా ఎదుర్కొనలేకపోయిందనే చెప్పాలి. ఆయన సంధించిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎప్పుడు ఇవ్వలేకపోయింది. నిత్యం వైసీపీ పాలనలో లోపాల తప్పుపడుతూనే ఉన్నా రఘురామ మొన్నటి వరకు కూడా ఆ పార్టీలో ఉన్నారు. సరిగా ఎన్నికలకు నెలన్నర ముందు వైసీపీకి రాజీనామా చేశారు.

గతంలో ఏపీ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసింది. తనను కస్టడీలో పోలీసుల కొట్టారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అయినా సరే బయటకు వచ్చిన తర్వాత రఘురామ విమర్శల దాడిని మరింత పెంచారు. నేరుగా సీఎం వైఎస్ జగనే టార్గెట్ చేశారు. ఆ పార్టీలోని వ్యవహారాలను బయటపెట్టారు. తనకు అనుమతులు లేకపోవడంతో నాలుగేళ్లపాటు తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం వెళ్లలేకపోయారు. ఇటీవల నాలుగేళ్ల తర్వాత తన సొంత నియోజకవర్గానికి వెళ్లారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.

మరి వైసీపీ రఘురామకృష్ణరాజు ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది. ఆయనకు బీజేపీ జాతీయ నేతలతో మంచి సంబంధాలున్నాయి. గతంలో సినీనటుడు కృష్ణంరాజు నరసాపురం నుంచి ఎంపీగా బీజేపీ తరఫున గెలిచారు. 2014 పొత్తులోనే బీజేపీనే నరసాపురం నుంచి పోటీ చేసింది. ఇప్పుడు కూడా టీడీపీ-జనసే కూటమిలో బీజేపీ చేరడం ఖాయంగా కనిపిస్తుంది. అంటే రఘురామ బీజేపీ నుంచి నరసాపురం బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×