EPAPER

Summer Health tips: సమ్మర్.. ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి!

Summer Health tips: సమ్మర్.. ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి!

summer health tips


Tips For Healthy Summer : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రాత్రి సమయంలో వాతావరణం కాస్త కూల్‌గా అనిపించినా.. మధ్యాహ్నానికి భానుడు తన ప్రభావాన్ని చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటతిరగడం అంత సేఫ్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దలు వరకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ప్రారంభమవుతున్న కారణంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

వీలైనంత వరకు ఇంట్లో ఉండేందుకు ప్రయత్నించాలని ప్రయత్నిస్తున్నారు. సమ్మర్‌లో సురక్షితంగా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


Read More : ఈ ఐదు ఆసనాలతో కొలెస్ట్రాల్‌ మాయం..!

బయటకు వెళ్తే ఇవి పాటించండి

  • మధ్యాహ్నం ఎండ అధికంగా ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.
  • ఎండ తీవ్రత తక్కువగా ఉంటే బయటకు వెళ్లండి.
  • కాటన్ దుస్తులను ధరించండి.
  • ముఖ్యంగా తెలుపు రంగు, పలుచని బట్టలు ధరించండి.
  • ఇంటి నుంచి బయటకు వెళుతుంటే చేతులు పూర్తిగా కప్పే దుస్తులు ధరించండి.
  • తలకు క్యాప్ పెట్టుకోండి. లేదా గొడుగును వాడండి.
  • కళ్లను సన్‌గ్లాస్ పెట్టుకోండి.

నీరు అధికంగా తాగండి

  • ఎండ తీవ్రత వల్ల శరీరం పొడిబారుతుంది. కాబట్టి మీ శరీరానికి తగ్గట్టుగా నీరు తాగండి.
  • మీ శరీరానికి తగ్గట్టుగా నీరు తాగడం వల్ల ఎప్పుడూ కూల్‌గా ఉంటారు.
  • రోజుకు 4 లీటర్లు వాటర్ తాగితే మంచిది.
  • నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
  • మద్యానికి దూరంగా ఉండండి.
  • బరువు ఎక్కువగా ఉండేవారు నీరు ఎక్కువగా తాగాలి.

ఫ్యాన్ వద్దు

  • సూర్యుని కిరణాలు ఇంట్లోకి రాకుండా చూడండి.
    డోర్ కర్టెన్లు వాడండి.
  • ఎండ అధికంగా ఉంటే తలుపులు, కిటికీలు మూసి వేయండి.
  • ఎండకాలంలో సీలింగ్ ఫ్యాన్‌లు ఉపయోగించకండి.
  • కిటికీల వద్ద టేబుల్ ఫ్యాన్ పెట్టకండి. ఇలా చేయడం వల్ల బయట వేడి గాలి లోపలికి వస్తుంది.
  • బయటకు వెళ్లేప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లండి.
  • కిటికీలకు చల్లటి గుడ్డలు వేలాడదీయండి.

వ్యాయామాలు వద్దు

  • ఎండలు అధికంగా ఉంటే వ్యాయామం చేయకండి.
  • వ్యాయామాన్ని ఉదయాన్నే చేయండి.
  • పిల్లలను ఎండల్లో ఆడనీవకండి.
  • ఎండలోకి వెళ్లేప్పుడు సన్‌స్క్రీన్ లోషన్స్ వాడాలి.

పరిశుభ్రత

  • సమ్మర్‌లో పరిశుభ్రత చాలా ముఖ్యం.
  • శుభ్రంగా ఉండకపోతే చెమట గ్రంథులు మూసుకుపోతాయి.
  • రెండు పూటల స్నానం చేయండి.
  • మధ్నాహ్నం అసలు స్నానం చేయొద్దు.
  • ఉదయాన్నే 8 లోపు స్నానాలు పూర్తి చేయండి.
  • చర్మంపై రోజంతా తేమ ఉండేలా చూసుకోండి.
  • నీటితో కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీములను చర్మానికి రాయండి.
  • సూర్యుని నుంచి వెలువడే అతిలోనిహిత కిరణాలు చర్మంపై పడకుండా చూడండి.
  • ఈ కిరణాల వల్ల చర్మం ముడతలు బడుతుంది.
  • చర్మానికి ఎస్‌పీఎఫ్-15 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను రాయండి.
  • ముఖాన్ని చల్లటి నీటితో 4 లేదా 5 సార్లు శుభ్రం చేయండి.
  • టమాటా, నిమ్మరసాలతో ఫేస్‌ప్యాక్‌లు వేయండి.

Disclaimer : ఈ సమచారాన్ని పలు హెల్త్ జర్నల్స్ ఆధారంగా, నిపుణుల సూచనల మేరకు మీ అవగాహన కోసం అందిస్తున్నాం.

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×