EPAPER

SP MP Shafiqur Rahman Barq : దేశంలోనే వృద్ధనేత.. ఎస్పీ ఎంపీ షఫీకర్ రహ్మాన్ బార్క్ కన్నుమూత..

SP MP Shafiqur Rahman Barq : దేశంలోనే వృద్ధనేత.. ఎస్పీ ఎంపీ షఫీకర్ రహ్మాన్ బార్క్ కన్నుమూత..

 


MP Shafiqur Rahman Barq

samajwadi party MP Shafiqur Rahman Barq Passes Away:సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీకర్ రెహ్మాన్ బార్క్ కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. బార్క్ 1930లో జన్మించారు.ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని సభల్ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.


చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మొరాదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బార్క్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ క్రమంలో మొరాదాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. బార్క్ 1996లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. 2019లో ఐదోసారి సంభాల్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని దీపా సరాయ్‌లో హఫీజ్ అబ్దుర్ రెహ్మాన్, హజ్రా బేగం దంపతులకు షఫీకర్ రెహ్మాన్ బార్క్ జన్మించారు. బార్క్ ములాయం సింగ్ యాదవ్‌కు సన్నిహితుడిగా మెలిగారు. బార్క్ ఖురేషా బేగంను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. ఖురేషా బేగం కూడా కొన్నేళ్ల క్రితం మరణించారు.

షఫీకర్ రెహ్మాన్ బార్క్ 1986లో బాబ్రీ మసీదు కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం కింద అరెస్టై మొరాదాబాద్ జిల్లా జైలులో ఉన్నారు. బార్క్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ ట్రస్ట్ ఛైర్మన్, వ్యవస్థాపక ట్రస్టీతోపాటు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశారు.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×