EPAPER

MBNR MLC By Election : మహబూబ్ నగర్ MLC ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

MBNR MLC By Election : మహబూబ్ నగర్ MLC ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

Mahabubnagar mlc by election update


MBNR MLC By Election Schedule(Political news in telangana): తెలంగాణలో మరో ఉపఎన్నికకు రంగం సిద్ధమయింది. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయ్యింది. మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుండగా.. అదే రోజు నుండి నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. మార్చి 11వ తేదీతో నామినేషన్లు స్వీకరణ గడువు ముగుస్తుంది. మార్చి 12న నానేషన్ల పరిశీలిస్తారు. మార్చి 14 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. మార్చి 28న పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. బీఆర్ఎస్ ను వీడి.. హస్తం అందుకున్న ఆయన.. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. లోక్ సభ ఎన్నికలకంటే ముందే ఇక్కడ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది.


Read More :

కాగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ నుంచి, కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలయ్యారు. గవర్నరర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ లు ఎంపికయ్యారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ దక్కించుకుంటుందా లేక బీఆర్ఎస్ గెలుస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.

 

Tags

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×