EPAPER

PM Narendra Modi: ప్రభుత్వ జోక్యం లేని సమాజాన్ని సృష్టించడమే లక్ష్యం: ప్రధాని మోదీ

PM Narendra Modi: ప్రభుత్వ జోక్యం లేని సమాజాన్ని సృష్టించడమే లక్ష్యం: ప్రధాని మోదీ
society without government interference
 

society without government interference: ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండే సమాజాన్ని సృష్టించడమే తన లక్ష్యమని, ప్రజల శ్రేయస్సును నిర్ధారించడానికి ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద గ్లోబల్‌ టెక్స్‌టైన్ ఈవెంట్‌ల్లో ఒకటైన భారత్‌ టెక్స్‌ 2024లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు.


ఈ ఈవెంట్‌ను ఢిల్లీలోని భారత మండపం వేదికగా సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 100దేశాల నుంచి ఎగ్జిబిటర్లు, కొనుగోలుదారులు, వాణిజ్య సందర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్లప్పుడు పేదలకు అండగా ఉండాలి అన్నారు.

Read More: ఉచిత విద్యుత్ పథకం సబ్సిడీ వివరాలివే.. అర్హులెవరో తెలుసుకోండి..


ప్రభుత్వం నుంచి జోక్యం లేని సమాజాన్ని మనం సృష్టించాలి అన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి జీవితాల్లో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా తాను ప్రభుత్వ జోక్యం లేకుండా ఉండే సమాజాన్ని సృష్టించడానికి పోరాడుతున్నానని అన్నారు.

రాబోయే ఐదేళ్లలో కూడా ఇదే కృషిని కొనసాగిస్తానని తెలిపారు. దేశంలో శ్రేయస్సును నిర్ధారించడంలో ప్రభుత్వం ఉత్ప్రేరక ఏజెంట్‌గా పనిచేయాలని ఆయన చెప్పారు. దేశాన్ని ‘వికసిత్‌ భారత్‌’గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×