EPAPER

CM Revanth Reddy on LRS: ఎల్ఆర్ఎస్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. దరఖాస్తులకు గుడ్ న్యూస్!

CM Revanth Reddy on LRS: ఎల్ఆర్ఎస్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. దరఖాస్తులకు గుడ్ న్యూస్!
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy key Decision on LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన దరఖాస్తులపై క్లారిటీ ఇచ్చింది. ఆ లేఔట్‌లను క్రమబద్ధీకరణకు ఛాన్స్ ఇచ్చింది.


దరఖాస్తుదారులకు మార్చి 31లోపు ఈ అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ లోనే ఎల్ఆర్ఎస్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు.

2020లో ఎల్ఆర్ఎస్ కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా మూడున్నరేళ్ల ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. దరఖాస్తుల ఆశలు ఫలించాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్.. దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 31లోపు మొత్తం రుసుం చెల్లించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తారు.


Read More: వన దేవతల్ని దర్శించుకున్న 1. 45 కోట్ల మంది భక్తులు..

ప్లాట్ల క్రమబద్దీకరణలో కొన్ని షరతలు పెట్టారు. దేవాదాయ, వక్ఫ్‌ భూములకు క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వరు. కోర్టు ఆదేశాలు ఉన్న భూములకు ఇదే నియమం వర్తిస్తుంది. ప్రభుత్వ ఆదేశాలు ఉన్న భూములకు క్రమబద్దీకరణకు అవకాశం లేదు. ఇతర ఇతర లే వుట్‌లకు క్రమబద్దీకరణ అవకాశం ఇస్తారు. గతంలో చాలా మంది ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం రూ. వెయ్యిం చెల్లించారు. వారందరికీ ఈ అవకాశం దక్కుతుంది.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలోని లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు గతంలో ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దరఖాస్తులు ఆహ్వానించింది. ప్లాట్ల క్రమబద్దకరకు
25 లక్షల మందిపైగా దరఖాస్తు చేశారు. ప్రభుత్వం నిర్ణయంపై కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. దీంతో ప్లాట్ల క్రమబద్దీకరణ ప్రక్రియ నిలిచిపోయింది.

తెలంగాణలో ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల వివరాలు సేకరించారు. ఇప్పుడు
ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది.

Related News

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Big Stories

×