EPAPER

V. Mahesh Passed Away: ఇండస్ట్రీలో మరో విషాదం.. సినీ నిర్మాత వి. మహేష్ కన్నుమూత

V. Mahesh Passed Away: ఇండస్ట్రీలో మరో విషాదం.. సినీ నిర్మాత వి. మహేష్ కన్నుమూత


V. Mahesh Passed Away: ప్రముఖ సినీ, టీవీ నిర్మాత, రచయిత వి. మహేశ్ (85) చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన తన నివాశంలో జారిపడిపోవడంతో హుటా హుటిన హాస్పిటల్‌కి తరలించగా.. మహేశ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహేశ్ మృతిపై సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

నెల్లూరు జిల్లా కొరుటూరు ఆయన గ్రామం. ఆయన మొదటిగా 1975లో ‘మాతృమూర్తి’ చిత్రంతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1976లో ‘మనుషులంతా ఒక్కటే’చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రానికి గానూ ఆయనకు మంచి గౌరవం లభించింది.


మనుషులంతా ఒక్కటే’చిత్రానికి గానూ ఆయనకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును మహేశ్ అందుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీ దీపరక్ దర్శకత్వంలో ‘మహాపురుషుడు’, చిరంజీవి కోడి రామకృష్ణ కలయికలో ‘సింహపురి సింహం’, బోయిన సుబ్బారావు దర్శకత్వంలో సుమన్, భానుప్రియలతో ‘ముసుగు దొంగ’ వంటి చిత్రాలను ఆయన నిర్మించి మంచి పేరు సంపాదించుకున్నారు.

Read More: యానిమల్ విజయాన్ని అందుకే ఆస్వాదించలేదు.. స్పందించిన రష్మిక

అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్‌లో టెలీకాస్ట్ అయిన ‘హరి భక్తుల కథలు’ సీరియల్‌‌కు ఆయన నిర్మాతగా, రచయితగా ఉన్నారు. దీంతోపాటు ‘విప్రనారాయణ’కు 2009లో ఉత్తమ టెలీ ఫిలింగా బంగారు నంది అవార్డు అందుకోవడంతో పాటు మరో మూడు విభాగాల్లో నంది పురస్కారాలను మహేశ్ అందుకున్నారు.

అంతేకాకుండా ఆయన తన అన్నయ్య ప్రముఖ కళా దర్శకుడు స్వర్గీయ వి.వి రాజేంద్ర కుమార్‌తో కలిసి సినిమాలకు ప్రచార సాయగ్రిని తయారు చేసేందుకు ‘స్టూడియో రూప్‌కళ’ను అలాగే చిత్ర నిర్మాణ సంస్థ ‘ఆదిత్య చిత్ర’ అనే సంస్థను నెలకొల్పారు. కాగా ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించిన మహేశ్ వివాహం చేసుకోలేదు. ఇకపోతే ఆయన అంత్యక్రియలు చెన్నైలో ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×