EPAPER

Measles: మళ్లీ పెరిగిన మీజిల్స్‌.. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు చిన్నారులు మృతి..

Measles: మళ్లీ పెరిగిన మీజిల్స్‌.. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు చిన్నారులు మృతి..

Measles Spreads In MP


Measles Spreads In MP: మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో ఇద్దరు పిల్లలు మీజిల్స్‌తో మరణించారు. 17 మంది వ్యాధి బారిన పడ్డారు. మీజిల్స్‌ కేసులు రోజురోజుకు పెరగతున్నాయి. దీంతో ఎనిమిది గ్రామాల్లోని అన్ని పాఠశాలలను 3 రోజుల పాటు మూసివేయాలని అధికారులను నిర్ణయించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2022 సంవత్సరంలో భారతదేశంలో 11 లక్షల మంది పిల్లలు మీజిల్స్ వ్యాక్సిన్ మొదటి డోస్‌ వేసుకోలేదు అని అంచనా వేశారు. గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇద్దరు పిల్లలు ఈ వ్యాధితో మరణించారు.


మీజిల్స్ ఒకరి నుంచి మరోకరికి వెంటనే వ్యాపించే అంటు వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారికి తీవ్రమైర జ్వరంతో పాటు దద్దుర్లు వస్తాయి. మీజిల్స్ ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే గాలి ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

Read More: బిజేపీలో మోదీ వారసుడెవరు?.. 2024 ఎన్నికల తరువాత బిజేపీ 3.0 ఎలా ఉండబోతోంది?

కళ్ళు ఎర్రబడటం, నోటిలో తెల్లటి మచ్చలు రావడం. శరీరమంతా దద్దుర్లు రావడం వంటి లక్షణాలతో ఈ వ్యాధి మొదలైతోంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. ఇది సాధారణంగా 10 నుంచి 14 రోజులు పాటు ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటే ఈ వ్యాధి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు.

మీజిల్స్‌తో బారిన పడినవారు ఇంట్లోనే ఉండటం మంచిది. ఈ వ్యాధి సోకిన వ్యక్తికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటం మంచిది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వాడకం పెరిగినప్పటికీ.. సంవత్సరానికి రెండు లక్షలకు పైగా పిల్లలు ఇప్పటికీ మీజిల్స్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లుగా పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×