EPAPER

Pm Modi Scuba Diving : మోదీ స్కూబా డైవింగ్.. ద్వారక సందర్శన

Pm Modi Scuba Diving : మోదీ స్కూబా డైవింగ్.. ద్వారక సందర్శన

 


PM Modi dives down to submerged city of Dwarka

PM Modi dives down to submerged city of Dwarka: ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ చేశారు. సముద్రం లోలోతుల్లోకి వెళ్లిన ఆయన.. ద్వారక మునిగిపోయిన ప్రాంతాన్ని సందర్శించారు. భారత సంస్కృతికి, ఆధ్యాత్మికతకు నెలవైన ఆ పురాతన స్థలి వద్ద ప్రత్యేక పూజలు చేశారు.


నీటి అడుగున శ్రీకృష్ణ భగవానుడికి నెమలి పింఛాన్ని కూడా సమర్పించారు. నీటిలో మునిగిన ద్వారకా నగరంలో పూజలు చేయడం దివ్యానుభవమని మోదీ ట్వీట్ చేశారు.

తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (ఫిబ్రవరి 25) దేవభూమి ద్వారకలోని పంచకుయ్ బీచ్‌లో అరేబియా సముద్ర తీరంలో స్కూబా డైవింగ్ చేశారు.

Read more:ఎన్నికల కోడ్‌.. మన్‌ కీ బాత్‌కు 3 నెలల బ్రేక్..

బేట్ ద్వారకా ద్వీపం సమీపంలోని ద్వారక తీరంలో స్కూబా డైవింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ ప్రజలు పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్విన పురాతన ద్వారక నీటి అడుగున అవశేషాలను చూడవచ్చు.

ద్వారకలోని శ్రీకృష్ణుడి ఆలయంలో కూడా ప్రధాని మోదీ ప్రార్థనలు చేశారు. అంతకుముందు, దేవభూమి ద్వారక జిల్లాలోని బేట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగాన్ని కలుపుతూ అరేబియా సముద్రంపై దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రధాని ప్రారంభించారు. తర్వాత బేట్ ద్వారకలోని శ్రీకృష్ణుని ఆలయంలో కూడా ఆయన ప్రార్థనలు చేశారు.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×