EPAPER

Heartbreaking Moment koala: అయ్యో !ఎంత విషాదం.. చూస్తుంటే మనకే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయే..

Heartbreaking Moment koala: అయ్యో !ఎంత విషాదం..  చూస్తుంటే మనకే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయే..

koala-mourning-death-companion-heartbreaking-video-viral


Heartwrenching video of koala grieving dead friend: మాట్లాడటం మినహా, మనుషులకుండే అన్ని భావోద్వేగాలు ప్రపంచంలోని అన్ని ఇతర జీవుల్లోను సహజమే.. ఆకలి దప్పికలతో పాటు, కోపం శోకం, దుఃఖం ఇలా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. జీవిత సహచరుడిని కోల్పోవడాన్ని మించిన విషాదం మరొకటి ఉండదు. అలా ఒక చెట్టు క్రింద, ప్రేయసిని కోల్పోయి విలపించిన కయోలా హృదయ విదారక వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సౌత్ ఆస్ట్రేలియన్ వాలంటీర్ కయోలా రెస్క్యూ గ్రూపు ఈ కయోలాను గుర్తించింది. అక్కడ మరణించిన ఆడ కయోలాను పట్టుకుని మగ కయోలా విలపిస్తోంది. ఈ సంఘటన చాలా హృదయ విదారకం అంటూ ఈ టీం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ జంటను చూసినప్పుడు గుండె పగిలిందన్నారు కయోలా రెస్క్యూ అధికారి హార్ట్లీ భావోద్వేగానికి లోనయ్యారు. అత్యంత విషాదకరమైన వీడియో. గుండె పగిలిపోయింది.. నా కళ్లలోను నీళ్లు తిరుగుతున్నాయంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేసారు.

ఈ వీడియో ఇప్పటికే 12 మిలియన్లకు పైగే వ్వూస్ దక్కించుకుంది.

Read more:నోరొవైరస్‌తో అమెరికన్ల బెంబేలు


కాగా ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలోని యూకిలిప్టస్ అటవీ ప్రాంతంలో ఇవి కనిపిస్తాయి. ఇవి యూకిలిప్టస్ ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. అంతేకాదు ప్రపంచంలోనే రోజుకి 22 గంటలు నిద్రించే జంతువు. తమ జీవిత కాలంలో ఒక్కసారి కూడా నీళ్ళు త్రాగవు. అందుకే వీటిని “నో డ్రింక్ “జంతువు అని కూడా అంటారు. యూకిలిప్టస్ ఆకుల్లో ఉండే తేమే వీటికి ఆహారం

Related News

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Viral News: సమస్యపై స్పందించట్లేదని ఓలాపై యువతి వినూత్న నిరసన…

World’s Richest Dog: సింహాసనంపై శునకం.. రూ.3300 కోట్ల ఆస్తికి అధిపతి ఈ కుక్క.. ప్రైవేట్ ప్లేన్, బిఎండబ్ల్యూ కారు ఇంకా ఎన్నో..

Man Extracts 23 Teeth: ఒకేరోజు 23 పళ్లు తీయించుకున్నాడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు..!

Viral Video: వెర్రి వేశాలు కాకపోతే.. అసలు బైక్‌తో రైలు ఇంజిన్ ను లాగొచ్చా..

Shocking Video: ఎంతటి అద్భుతం.. గణేషుడికి నమస్కరించి మోదకం తీసుకున్న చిట్టెలుక..

Big Stories

×