EPAPER

kalki 2898 ad: ప్రభాస్ ‘కల్కి’ వాయిదా.. మేకర్స్ ఫుల్ క్లారిటీ..

kalki 2898 ad: ప్రభాస్ ‘కల్కి’ వాయిదా.. మేకర్స్ ఫుల్ క్లారిటీ..


kalki 2898 ad: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే సలార్‌తో ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఇందులో ప్రభాస్ మాస్ లుక్ తమ అభిమానులను ఉర్రూతలూగించింది. ఇక ఫైట్ సీన్ల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆరడుగుల కటౌట్‌కి దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌పై తెరకెక్కించిన ఫైట్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి.

ఇక ఈ మూవీతో దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించాడు. ఇక ఈ మూవీ తర్వాత మరికొన్ని సినిమాలను తన లైనప్‌లో ఉంచాడు. అందులో దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ‘కల్కి ఏడీ 2898’ మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.


గతం, వర్తమానం, భవిష్యత్తు ఇలా మూడు టైమ్స్ లైన్స్‌పై హిందూ మైథాలజీ స్టోరీ ఆధారంగా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా దిశా పటానీ కనిపించనుంది.

READ MORE: ప్రభాస్ ‘కల్కి’ థీమ్ మ్యూజిక్ రివీల్.. ఫిదా అయిపోయిన ఫ్యాన్స్.. మెంటల్ ఎక్కిస్తున్న వీడియో!

ఇక ఈ మూవీకి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది. ఈ మూవీని ఈ ఏడాది మే 9న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. అయితే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పెండింగ్‌లో ఉందని.. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఇంకా మిగిలి ఉందని టాక్ వినిపించింది.

ఈ క్రమంలోనే ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై మూవీ యూనిట్ తాజాగా స్పందించింది. ప్రభాస్‌కి సంబంధించిన ‘జస్ట్ ది వార్మ్ అప్’ అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ మూవీ మే 9న రిలీజ్ కానుంది అంటూ పేర్కొంది. దీంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతుంది అనే వార్తలకు చెక్ పెట్టినట్లయింది.

READ MORE: ప్రభాస్ ‘కల్కి’ మూవీకి దీపికా రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.. రూ. 20 కోట్లా..?

కాగా ఈ మూవీలో భారీ తారాగణం నటిస్తుంది. కోలీవుడ్ నుంచి కమల్ హాసన్, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్‌ వంటి స్టార్ నటులు నటించబోతుండటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వీరితో పాటుగా మరెందరో ప్రముఖ నటీ నటులు ఈ మూవీలో భాగం కాబోతున్నారు.

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×