EPAPER

Gemini AI Tool: పీఎం మోదీపై ప్రశ్న.. గూగుల్ జెమినీ వివాదాస్పద సమాధానం.. కేంద్రం సీరియస్

Gemini AI Tool: పీఎం మోదీపై ప్రశ్న.. గూగుల్ జెమినీ వివాదాస్పద సమాధానం.. కేంద్రం సీరియస్

Gemini AI Tool: ప్రస్తుతంఅర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం విఫరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే గూగుల్ కూడా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ను తయారు చేసింది. ఇప్పుడు ఇదే దేశంలో పెద్ద దుమారానికి కారణం అయ్యింది. అయితే గూగుల్ రూపొందించినటువంటి జెమినీ ఏఐ టూల్ అత్యంత ఖచ్చితత్వంతో పని చేస్తుందని గూగుల్ తెలిపింది. అయితే అదే జెమినీ ఏఐ ఇచ్చిన వివాదాసపద సమాధానంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ ప్రశ్న ప్రధాని మోదీ మీద కావడం గమనార్హం.


ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే న్ని టెక్ దిగ్గజాలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట పడుతున్నాయి. అయితే టెక్నాలజీలో చిన్నచిన్న పొరపాట్లు పెద్ద తప్పులకు కారణం అవుతోంది. ఏఐలో ఉన్న సమాచారం అంతా నిజమైందో కాదో తెలియక నెటిజన్లు తీవ్ర అయోమయం చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ జెమినీ అనే ఏఐ టూల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అత్యంత అడ్వాన్స్ డ్ వర్షన్ ఏఐ టూల్ అని.. చాలా ఖచ్చితత్వంతో సమాధానాలు ఇస్తుందని గూగుల్ ప్రకటించింది. అయితే ప్రధాని మోదీ గురించి జెమినీ ఏఐ టూల్ లో అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానం ఇచ్చింది. దీనిపై కేంద్రం ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తోంది.

పీఎం మోదీ ఫాసిస్టా అంటూ ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు గూగుల్ జెమిని ఏఐ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ గురించి అడిగితే మాత్రం.. ఖచ్చితంగా, స్పష్టంగా సమాధానం చెప్పలేం అంటూ జెమినీ ఏఐ టూల్ జవాబు ఇచ్చింది. ప్రధాని మోదీ గురించి అడిగిన ప్రశ్న, దానికి గూగుల్ జెమినీ ఏఐ టూల్ ఇచ్చిన సమాధానానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి తెగ వైరల్‌ అవుతున్నాయి.


Read More: రూ.350 కోట్ల హెరాయిన్ పట్టివేత..

దీంతో గూగుల్ జెమిని ఏఐ టూల్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ ఏఐ టూల్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో కేంద్రం దీన్ని తీవ్రంగా విషయంగా పరిగణిస్తుంది. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ ఈ అంశం ఐటీ చట్టం నిబంధనలను ఉల్లంఘించడం కిందికి వస్తుందన్నారు. క్రిమినల్ కోడ్ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లేనని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

గూగుల్ గతేడాది డిసంబర్ లో ఈ అడ్వాన్సడ్ వెర్షన్ జెమినీ ఏఐ టూల్ ను పరిచయం చేసింది. ఇది టెక్ట్స్, ఫోటో, ఆడియో, వీడియో కోడింగ్ వంటి వివిధరకాల సమాచారాన్ని 90 శాతం ఖచ్చితత్వంతో అందిస్తుందని తెలిపింది. అయితే ఇటీవల జెమినీ వాడకంపై గూగుల్ తమ వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. ఈ ఏఐ టూల్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే క్రమంలో వ్యక్తిగత, సున్నితమైన డేటాని షేర్ చేయొద్దని సూచించింది.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×