EPAPER

Prime Minister visit: వారణాసిలో పీఎం పర్యటన.. అర్థరాత్రి కొత్త రోడ్డును తనిఖీ చేసిన మోదీ..

Prime Minister visit: వారణాసిలో పీఎం పర్యటన.. అర్థరాత్రి కొత్త రోడ్డును తనిఖీ చేసిన మోదీ..

PM Modi Late Night inspection at Varanasi: వారణాసిలోని శివపూర్-ఫుల్వారియా-లహర్తర మార్గ్‌ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రధాని గురువారం అర్థరాత్రి తనిఖీ చేశారు. శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం వారణాసి చేరుకున్నారు.


వచ్చి రాగానే ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి శివపూర్-ఫుల్వారియా-లహర్తర మార్గ్‌ను పరిశీలించారు. 360 కోట్లతో నిర్మించిన ఈ రహదారి బనారస్‌ హిందూ యూనివర్సిటీ నుంచి వారణాసి విమానాశ్రయం వైపు ప్రయాణ సమయాన్ని 75 నిమిషాల నుండి 45 నిమిషాలకు తగ్గిస్తుందని అధికారులు తెలిపారు.

దీంతో ట్రాఫిక్‌ వద్దీని తగ్గించవచ్చని తెలిపారు. లహర్తర నుండి కచాహ్రీకి దూరాన్ని 30 నిమిషాల నుండి 15 నిమిషాలకు తగ్గుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడంతో దక్షిణ ప్రాంతంలోని ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది అని మోదీ తన ట్వీటర్‌లో రాసుకొచ్చారు.


Read More: ‘అగ్నిపథ్’ నోటిఫికేషణ్‌ విడుదల.. ఏప్రిల్‌ 22 నుంచి పరీక్షలు

ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మోదీ శుక్రవారం ఉదయం 11:30 గంటలకు సంత్ గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని ఒక కార్యక్రమానికి హాజరుకానున్నారు. అంతకు ముందు సంత్ గురు రవిదాస్ జన్మస్థలిలో పూజలు నిర్వహిచనున్నారు.

తన సొంత పార్లమెంట్‌ నియోజకవర్గమైన వారణాసిలో రూ.13,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసి బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×