EPAPER

Agneepath Notification 2024: ‘అగ్నిపథ్’ నోటిఫికేషణ్‌ విడుదల.. ఏప్రిల్‌ 22 నుంచి పరీక్షలు!

Agneepath Notification 2024: ‘అగ్నిపథ్’ నోటిఫికేషణ్‌ విడుదల.. ఏప్రిల్‌ 22 నుంచి పరీక్షలు!
Agnipath Scheme

Agnipath Scheme – Indian Army: అగ్రివీర్‌ 2024-25 రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషణ్‌ ఫ్రిబ్రవరి 13న విడుదల చేశారు. సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం ‘అగ్నిపథ్’ పథకం ఫైర్‌మెన్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదలైంది. ఈ పోస్టులు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 22 చివరి తేదీ. ఏప్రిల్‌ 22 నుంచి పరీక్షలు ప్రారంభం.


‘అగ్నిపథ్’ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషణ్‌ ఫ్రిబ్రవర్‌ 13న విడుదలైంది. మార్చి 22న చివరి తేది. దరఖాస్తు రుసుము రూ.250. ఆన్‌లైన్‌ పరీక్ష ద్వార ఎంపిక చూస్తారు. ఈ పరీక్షలో అర్హులైన వారికి ఫిజికల్‌ ఈవెంట్‌లు నిర్వహిస్తారు. తదుపరి వైద్య పరీక్షలు ఉంటాయి. తరువాత సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది.

‘అగ్నిపథ్’ రిక్రూట్‌మెంట్‌ దరఖాస్తుకు కనీసం 10వ తరగతి 45శాతంతో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్‌ పోస్టుకైతే ఇంటర్‌ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్‌ 60శాతంతో ఉత్తీర్ణులైన వారి ఆఫీస్‌ అసిస్టెంట్‌కు అర్హులు అవుతారు. – ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, సికింద్రాబాద్. ట్రేడ్స్‌మన్‌కు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. అవివాహిత పురుషలు మాత్రమే దీనికి అర్హులు.


Read More: చరిత్ర చెప్పే బ్రిటీష్ కట్టడాలు..!

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి శారీరక ప్రమాణాలు ఇలా ఉండాలి.. ఎత్తు 166 సెం.మీ. ఉండాలి ఎత్తకు తగిన బరువు కలిగి ఉండాలి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివేర్ ట్రేడ్స్ మ్యాన్ పోస్టులతో ‘అగ్నిపథ్’ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

‘అగ్నిపథ్’ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన వారికి మొదట నాలుగేళ్ల పాటు ఆర్మీలో సేవలందించాల్సి ఉంటుంది. ప్రతీ నెల రూ.30,000 మొదటి సంవత్సరం. రెండో ఏడాది రూ.3000 పెంచుతూ.. మొత్తం నెలకు రూ.33,000. తరువాత మూడో సంవత్సరంలో నెలకు రూ. 36,000 చివరిగా నాల్గవ సంవత్సరానికి నెలకు రూ. 40,000 చెప్పునా ఉంటుంది.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×