EPAPER

Akaay AI Generated Pics: సోషల్ మీడియాలో అకాయ్ సందడి.. జూనియర్ కోహ్లీ ఏఐ ఫొటోలు వైరల్

Akaay AI Generated Pics: సోషల్ మీడియాలో అకాయ్ సందడి..  జూనియర్ కోహ్లీ ఏఐ ఫొటోలు వైరల్

Virat Kohli’s Son AI Generated Pics: క్రికెట్‌లో విరాట్ కొహ్లీ రికార్డుల మోత మోగిస్తుంటాడు. సినిమాల్లో అనుష్కశర్మ సూపర్ హిట్ సినిమాలతో అలరించింది. ఇప్పుడు వీరిద్దరి పుత్రరత్నం అకాయ్ అయితే పుట్టీ పుట్టగానే రికార్డుల మోత మోగించాడు. అదేమిటంటే విరాట్ కొహ్లీ తమకు అబ్బాయి పుట్టాడని, కొడుకు పేరు అకాయ్ అని పెట్టామని ప్రపంచానికి తెలియజేశాడు.


”ఫిబ్రవరి 15న అకాయ్‌౨ను ఈ లోకంలోకి స్వాగతించాం. మా జీవితంలోనే మధురమైన క్షణాలివి. ఈ సమయంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను కోరుకుంటున్నాం. అలాగే మా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి’ అంటూ విరాట్ కోహ్లి ఇన్‌‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అయితే నెట్టింట్లో ఈ పోస్ట్ రికార్డు సృష్టించింది.

అంతే ఈ పోస్ట్ పెట్టిన గంటలోనే 5 మిలియన్ వ్యూస్‌కి చేరిపోయింది. ఆసియాలోనే అత్యంత వేగంగా ఎక్కువ లైకులను అందుకున్న పోస్ట్‌గా రికార్డు సృష్టించింది. దీంతో తండ్రి గ్రౌండులో రికార్డులు సృష్టిస్తే,  కొడుకు గ్రౌండ్ మీద పడగానే రికార్డులతోనే మొదలెట్టాడని రాసుకొచ్చేస్తున్నారు. ప్రస్తుతం ‘అకాయ్’ పోస్ట్‌‌కు సుమారు ఎనిమిది మిలియన్ లైక్స్ వచ్చాయి.


Read More: రాంచీ మ్యాచ్‌లో ఎవరుంటారు?

మరోవైపున అకాయ్ పేరుపై రకరకాల సెర్చింగులు జరుగుతున్నాయి. అన్నీ దేశ భాషల్లో ఈ పేరుకి అర్థాలు వెతికేస్తున్నారు. టర్కీ భాషలో మాత్రం.. దీనికి ప్రకాశించే సూర్యుడు అని అర్థం వచ్చిందని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు విరాట్ కొహ్లీ తన కుమారుడి ఫొటోని ప్రపంచానికి చూపించలేదు. అందువల్ల సోషల్ మీడియాలో తక్కువోళ్లా.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ఉపయోగించి జూనియర్ కొహ్లీ బొమ్మను రెడీ చేసి, గ్రాఫిక్స్ రూపంలో వదిలేస్తున్నారు.ఈ జూనియర్‌కి టీమ్ ఇండియా జెర్సీ కూడా వేసేశారు. టీవీలో కొహ్లీ  క్రికెట్ ఆడుతుంటే, బుడ్డోడు చూస్తున్నట్టు పెడుతున్నారు.

మరోవైపు విశేషం ఏమిటంటే పాకిస్తాన్‌లో కూడా విరాట్ కొహ్లీ అభిమానులు స్వీట్లు పంచిపెట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోలు కూడా వైరల్ అయ్యీయి. క్రికెట్ అంటే ఎల్లల్లేని అభిమానానికి ఇది నిదర్శనమని,  కొహ్లీ అంటే క్రికెట్‌ను అభిమానించే ప్రతి ఒక్కరికి ఇష్టమని రాసుకొస్తున్నారు.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×