EPAPER

Brain Pacemaker for Depression: డిప్రెషన్‌ను తగ్గించే బ్రెయిన్ పేస్ మేకర్..

Brain Pacemaker for Depression: డిప్రెషన్‌ను తగ్గించే బ్రెయిన్ పేస్ మేకర్..

Brain Pacemaker that Reduces Depression: డిప్రెషన్ చికిత్స కోసం సరి కొత్త బ్రెయిన్ పేస్ మేకర్ వచ్చేసింది. ఈ పరికరం ద్వారా చేసే చికిత్స విధానం.. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS) తీవ్రమైన డిప్రెషన్ లక్షణాలతో బాధపడేవారికి ఇప్పుడో ఆశాకిరణం. సంప్రదాయ చికిత్సలతో ఎమిలీ హాలెన్‌బెక్ ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. డీబీఎస్‌తో ఆమె జీవితానికి కొత్త ఊపు వచ్చింది. ఈ చికిత్స ద్వారా సత్ఫలితాలు పొందిన అతి కొద్ది మంది రోగుల్లో ఆమె ఒకరు. ఎమిలీలాగానే మరెందరికో డీబీఎస్ చికిత్సా పద్దతి మానసిక ఆరోగ్యాన్ని కల్పించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


పార్కిన్సన్ వ్యాధి, ఎపిలెప్సీ లక్షణాల నుంచి ఉపశమనం కల్పించేందుకు డీబీఎస్‌ను రూపొందించారు. డిప్రెషన్‌ను తగ్గించడంలో దీని సామర్థ్యం ఎంత అన్నదీ ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు. ఈ చికిత్సలో భాగంగా లక్ష్యిత విద్యుత్తు ప్రేరణల కోసం పుర్రెలోకి ఎలక్ట్రోడ్‌లను ఇంప్లాంట్ చేస్తారు. అంటే పేస్‌మేకర్ తరహాలో పని చేస్తుందన్న మాట. అయితే గుండెకు కాకుండా పుర్రెకు దీనిని అమరుస్తారు.
ఈ వినూత్న పద్దతితో సానుకూల ఫలితాలు కనిపిస్తుండటంతో శాస్త్రవేత్తలు మరింతగా దృష్టి సారించారు. ఈ విధానంలో చిన్నపాటి సర్జరీ ఉంటుంది.

ఎమోషనల్ బిహేవియర్‌ను నియంత్రించే మెదడులోని నిర్దిష్ట భాగంలో ఎలక్ట్రోడ్‌లను చొప్పిస్తారు. ఛాతీ చర్మం దిగువున అమర్చే ఓ పరికరంతో వాటిని అనుసంధానిస్తారు. ఆ పరికరం ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్‌ను కలగజేస్తుంది. మెదడులోని సాధారణ న్యూరాన్ల పనితీరుకు ఈ పరికరంతో ఎలాంటి ఆటంకం కలగదు. ఈ పరికరాన్ని అమర్చిన కొన్ని రోజుల్లోనే ఎమిలీ మానసిక స్థితి సాధారణ స్థాయికి వచ్చేసింది. డిప్రెషన్ లక్షణాలు మటుమాయమయ్యాయి. సంగీతం, ఫుడ్ ద్వారా పొందే అనుభూతులను సైతం ఇప్పుడామె ఆస్వాదించగలుగుతోంది. డిప్రెషన్ కారణంగా ఇంతకాలం అలాంటి చిన్న ఆనందాలను సైతం ఎమిలీ కోల్పోయింది. ఆమెలాగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడే
రోగులకు డీబీఎస్ విధానం ఓ వరం కానుంది.


Tags

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×