EPAPER

Haiti President Jovenel Moise: ప్రెసిడెంట్‌ను హత్య చేయించిన భార్య.. మాజీ ప్రధానికి కూడా కుట్రలో భాగం!

Haiti President Jovenel Moise | కరేబియన్ దీవుల్లో మూడో అతిపెద్ద దేశమైన హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మొయిజ్ హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2021 జూలైలో ప్రెసిడెంట్ జోవెనెల్ మొయిజ్ హత్య చేయబడ్డారు. ఆయన హత్యకు ఆయన భార్య మార్టినె మొయిజ్, మాజీ ప్రధాన మంత్రి క్లాడ్ జోసెఫ్ కుట్ర పన్నారని ఆధారాలున్నట్లు హైతీ కోర్టు తెలిపింది.

Haiti President Jovenel Moise: ప్రెసిడెంట్‌ను హత్య చేయించిన భార్య.. మాజీ ప్రధానికి కూడా కుట్రలో భాగం!

Haiti President Jovenel Moise: కరేబియన్ దీవుల్లో మూడో అతిపెద్ద దేశమైన హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మొయిజ్ హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2021 జూలైలో ప్రెసిడెంట్ జోవెనెల్ మొయిజ్ హత్య చేయబడ్డారు. ఆయన హత్యకు ఆయన భార్య మార్టినె మొయిజ్, మాజీ ప్రధాన మంత్రి క్లాడ్ జోసెఫ్ కుట్ర పన్నారని ఆధారాలున్నట్లు హైతీ కోర్టు తెలిపింది.


ఈ హత్య కేసు డాక్యుమెంట్లు మీడియాలో లీక్ కావడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రెసిడెంట్ జోవెనెల్‌ని కొంతమంది కొలంబియాకు చెందిన కిరాయి హంతకులు జూలై 7 2021 రాత్రి ఆయన ఇంట్లోకి ప్రవేశించి హత్య చేశారు. ఈ ఘటనలో ప్రెసిడెంట్ భార్య కూడా గాయపడినట్లు ఆ సమయంలో స్థానిక మీడియా తెలిపింది.

జోవెనెల్‌ని హత్య చేసి.. ఆయన స్థానంలో ప్రెసిడెంట్ పదవి చేపట్టడానికి ఆయన భార్య ఈ హత్య చేయించదని న్యాయమూర్తి వాల్తర్ వెస్సర్ కేసు విచారణ సమయంలో చెప్పారు. కేసు విచారణ సమయంలో వేర్వేరు సందర్భాల్లో ఆమె ఇచ్చిన వాంగ్మాలం పరస్పర విరుద్ధంగా ఉండడంతో ఆమెపై అనుమానం కలిగిందని కేసు డాక్యుమెంట్స్‌లో ఉంది. ఆ తరువాత సాగిన విచారణలో ప్రధాన మంత్రి క్లాడ్ జోసెఫ్, మాజీ పోలీస్ డైరెక్టర్ జెనెరల్ లియోన్ చార్లెస్ కూడా ప్రెసిడెంట్ హత్య కుట్రలో భాగంగా ఉన్నారని తెలిసింది.


ప్రెసిడెంట్ జోవెనెల్ హత్య కేసులో ఇప్పటివరకు దాదాపు 50 మందిని హైతీ పోలీసులు అరెస్టు చేశారు.

అమెరికాలో హైతీ ప్రెసిడెంట్ హత్య కేసు విచారణ
అమెరికాలోని మియామీలో హైతీ ప్రెసిడెంట్ హత్య కేసు విచారణ ప్రత్యేకంగా సాగుతోంది. ఈ హత్యకు కుట్ర అమెరికాలోని మియామీలో జరిగిందని ఆధారాలుండడంతో అమెరికా ప్రభుత్వం దీనిపై సీరియస్ అయింది. పైగా దక్షిణ అమెరికా దేశమైన కొలంబియా మాజీ సైనికులే ఈ హత్య చేశారు.

Read More: హౌతీల దాడి.. ఎర్రసముద్రంలో నౌకను వదిలి వెళ్లిన సిబ్బంది..

ప్రెసిడెంట్ జోవెనెల్ హత్య తరువాత 2021 నుంచి హైతీలో ఎన్నికలు జరగలేదు. ఆ దేశంలో ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభుత్వం లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదు. హైతీ రాజధానిలో విచ్చలివిడిగా క్రిమినల్ గ్యాంగ్స్ ఉండడమే దీనికి కారణం.

ఆ క్రిమినల్ గ్యాంగ్స్ వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి. ప్రస్తుతం హైతీలో ఈ క్రిమినల్ గ్యాంగ్స్ రాజ్యమేలుతున్నాయి. కేవలం 2023లోనే ఈ గ్యాంగ్స్ 4800 మందిని హత్య చేసినట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది.
వీరిని అడ్డుకునేందుకు కెన్యా దేశ పోలీసుల సహాయంతో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని మిలిటరీ బలగాలు త్వరలోనే రంగంలో దిగనున్నాయి.

Tags

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×