EPAPER

Etela rajender: మల్కాజిగిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ .. ఈటల క్లారిటీ..

Etela rajender: మల్కాజిగిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ .. ఈటల క్లారిటీ..

Etela Rajender Clarity on Malkajgiri Lok Sabha Contest: బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎంపీగా బరిలోకి దిగే యోచన ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ లో ఆయన ఓటమిపాలయ్యారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో తాను పోటీ చేసే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.


బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తే ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమేనని ఈటల స్పష్టం చేశారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారో కూడా వెల్లడించారు. తాను మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేయాలను కుంటున్నానని చెప్పారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానని తేల్చి చెప్పేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టులో బీజేపీ విజయ సంకల్ప యాత్ర నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ లోక్ సభ ఎన్నికలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎలాంటి లాభం ఉండదన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంతోనే దేశంలో అభివృద్ధి సాధ్యమని స్పష్టంచేశారు. మోదీ హయాంలో భారత్ లో సమూలమార్పులు తీసుకొచ్చారని తెలిపారు.


అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలు మార్పుకోరుకున్నారని ఈటల తెలిపారు. అందుకే కాంగ్రెస్ అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓడిపోయిన అభ్యర్థులు అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అహంకార పాలనకు ఇదే నిదర్శనమని విమర్శించారు.

Read More: ఓఆర్ఆర్ హైదరాబాద్ కు లైఫ్ లైన్.. ఆర్థిక ప్రగతే లక్ష్యం..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, కిషన్ రెడ్డి ఓడిపోయారు. కానీ ఆ తర్వతా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు పోటీ చేశారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఎంపీగా విజయం సాధించారు. అలాగే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. ఇప్పుడు ఇదే బాటలో ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఈటల.. ఇప్పుడు లోకసభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. బీజేపీకి కాస్త కూస్తో పట్టున్న హైదారాబాద్ ను వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. మహానగరంలో పరిధిలోని మల్కాజ్ గిరి నుంచి బరిలోకి దిగాలని తన మనసులో మాటను బయటపెట్టారు.

బీజేపీ అధిష్టానం ఈటలకు మల్కాజ్ గిరి టిక్కెట్ ఇస్తుందా? ఒకవేళ ఇవ్వకుంటే ఆయన పరిస్థితి ఏంటి ? అనే చర్చ నడుస్తోంది.

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×