EPAPER

Bob Moore Passed Away: ఉద్యోగులకు తన కంపెనీని ఇచ్చిన పెద్దాయన.. ఇక లేరు..

Bob Moore Passed Away: ఉద్యోగులకు తన కంపెనీని ఇచ్చిన పెద్దాయన.. ఇక లేరు..

Bob Moore is the founder of Bob’s Red Mill Company: తన కంపెనీలోని 700 మంద ఉద్యోగులకు యాజమన్య బాధ్యతలు అప్పగించిన ‘బాబ్స్ రెడ్ మిల్’ వ్యవస్థాపకుడు బాబ్ మూర్ కన్ను మూశారు. ఏదైనా ఒక సంస్థ లాభాల్లో నడుస్తుంటే సాధారణంగా ఉద్యోగులకు జీతాలు పెంచుతుంది. లేదా బోనస్ ప్రకటించడం చేస్తుంది. కానీ ఒక మిలియనీర్ మాత్రం 700 మంది ఉద్యోగులకు ఏకంగా ‘బాబ్స్ రెడ్ మిల్’ వ్యవస్థాపకుడు బాబ్ మూర్ ఏకంగా తన కంపెనీ యాజమాన్యం బాధ్యతలే అప్పగించాడు . ఆ సంస్థలకు హక్కులు కల్పించిన ఆయన ఇక లేరు.


అమెరికాకు చెందిన బాబ్ మూర్ తన సంస్థను 1978 లో స్థాపించారు. ఇది చిరుధాన్యాల నాణ్యమైన ఉత్పత్తులకు ప్రసిద్ది చెందింది. మూర్ తన కృషితో కంపెనీని ఉన్నత స్థాయిలో నిలిపారు. ఆ కంపెనీలో ఉన్న ఉద్యోగుల గురించి ఆయన ఉన్నతంగా ఆలోచించారు. ఉద్యోగులకు తన కంపెనీలో యాజమాన్యం ఇవ్వాలనుకున్నారు. 2010 సంవత్సరంలో తన 81వ పుట్టిన రోజు సందర్భంగా 209 మంది ఉద్యోగులకు యాజమాన్య వాటాను కేటాయించారు. అప్పటికే మూర్ యాజమాన్యం నుంచి వైదొలగడం గమనార్హం. ప్రస్తుతం ఆ కంపెనీలో 700 మంది ఉద్యోగులు ఉన్నారు. దీంతో పూర్తిగా ఉద్యోగుల కంపెనీగ మారిపోయింది.

తన కంపెనీకు ఉద్యోగులకు ఇచ్చే సందర్భంలో బాబ్ మూర్ మాట్లాడుతూ ఒక కంపెనీ ఉద్యోగుల కంటే లాభాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సాంప్రదాయాన్ని నివారించడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు. తన సంస్థను విక్రయించమని తనను చాలా మంది కలిశారన్నారు. తన నిర్ణయాన్ని చెబితే అవహేళన చేశారన్నారు.


Read More: పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్.. PML-N,PPP మధ్య కుదిరిన ఒప్పందం..

విజయం సాధించేందుకు కృషితో పాటు మనం కోసం పని చేసే వారి పట్ల దయతో మెలగడం కూడా ముఖ్యమని తెలిపారు. అందుకే తన కంపెనీ లాభాల బాట పట్టిన వెంటనే ఉద్యోగుల కోసం నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. తన దగ్గర చాలా డబ్బు ఉందన్నారు. వాటిని వృధాగా ఖర్చు చేయకుండా .. మంచి లక్ష్యానికి చేరేందుకు వినియోగిస్తున్నాని చెప్పారు.

ఫోర్బ్స్ ప్రకారం బాబ్స్ రెడ్ మిల్ సంస్థ 2018 నాటికి 100 మిలియన్ల డాలర్లుగా అంచనా వేసింది. ప్రస్తుతం 70 కంటే ఎక్కువ దేశాల్లో 200లకి పైగా ఉత్పత్తులను విక్రయిస్తోంది ఆ సంస్థ. అయితే ఫిబ్రవరి 10న కన్ను మూశారని కంపెనీ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన మృతి పట్ల ఉద్యోగులంతా సంతాపం ప్రకటించారు.

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×