EPAPER

TCS No Work From Home: “నో వర్క్ ఫ్రమ్ హోమ్”..! టీసీఎస్ కిలక నిర్ణయం.

TCS No Work From Home: “నో వర్క్ ఫ్రమ్ హోమ్”..! టీసీఎస్ కిలక నిర్ణయం.

TCS Declares No Work From For Employees: కరోనా సమయంలో ఐటీ వర్గాలకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సదుపాయం ఎక్కువ ప్రయోజనం చేకూర్చింది. దీని వల్ల కంపెనీల పనితీరుపై ఎలాంటి ప్రభావం పడలేదు. కానీ ఇప్పుడు అదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీ కంపెనీలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది.


దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీలో ఒకటైన టీసీఎస్ కూడా ఉద్యోగులను కార్యాలయాలకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇంటి నుంచి పని చేయడం ఉద్యోగులకే కాదు కంపెనీకి కూడా అంత మంచిది కాదని పేర్కొంది.

దీనితోపాటు భారీగా ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్నట్లు వచ్చిన వార్తలను కూడా టీసీఎస్ ఖండించింది. దీనికి విరుద్ధంగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నియామకాలను వేగవంతం చేయాల్సి ఉంటుందని కంపెనీ సీఈవో కె.కృతివాసన్ తెలిపారు.


సాఫ్ట్‌వేర్ పరిశ్రమ తన కీలక మార్కెట్‌లలో బలహీనమైన డిమాండ్ కారణంగా నియామకాలను మందగిస్తున్నట్లు నివేదికల మధ్య కంపెనీ సీఈఓ కె. కృతివాసన్ ప్రకటన వెలువడించారు. చాలా ఐటీ కంపెనీలు క్యాంపస్ సెలక్షన్ నుంచి తప్పుకుంటున్నాయని అన్నారు. కృతివాసన్ మాట్లాడుతూ.. ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి పనిచేయాలన్నారు. ఎందుకంటే ఉద్యోగి, సంస్థ రెండింటికీ పురోగతి సాధించడానికి ఇంటి నుంచి పని చేయడం సరైన మార్గం కాదన్నారు.

అంతకుముందు కూడా TCS తన ఉద్యోగులను కార్యాలయానికి వచ్చి మాత్రమే పని చేయాలని తెలిపింది. ఉద్యోగుల సంఖ్య, రాబడి, లాభాల పరంగా టీసీఎస్ భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారు అని పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ కేవలం 60,000 ఉద్యోగాలను మాత్రమే కల్పిస్తుందని ఐటీ కంపెనీల సంస్థ నాస్కామ్ (National Association of Software and Services Companies) గత వారం తెలిపింది.

దీంతో ఉద్యోగుల సంఖ్య 54.3 లక్షలకు చేరింది. కాగా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి సంకేతాలు కనిపిస్తున్నాయని కృతివాసన్ అన్నారు. కాబట్టి ఎక్కువ పని కోసం మాకు ఎక్కువ మంది అవసరం. వాస్తవానికి, రిక్రూట్‌మెంట్‌ను తగ్గించే ఉద్దేశం మాకు లేదు. ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ తరహాలోనే ముందుకు సాగుతాం. మేము నియామక ప్రక్రియను మార్చాలి. ప్రస్తుతం టీసీఎస్‌ ఆరు లక్షల మందికి పైగా ఉపాధి కలిపిస్తుందని తెలిపారు.

Tags

Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×