EPAPER

CM Revanth Reddy: ఓఆర్ఆర్ హైదరాబాద్ కు లైఫ్ లైన్.. ఆర్థిక ప్రగతే లక్ష్యం

CM Revanth Reddy: ఓఆర్ఆర్ హైదరాబాద్ కు లైఫ్ లైన్.. ఆర్థిక ప్రగతే లక్ష్యం

CM Revanth Reddy Speech In CII Meet: తెలంగాణను ప్రగతి పథంలో నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన సీఐఐ తెలంగాణ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. పెట్టుబడులకు రక్షణ కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. పరిశ్రమలు అభివృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నాటి ప్రధాని
ఇందిరా గాంధీ ఐడీపీఎల్‌ను ప్రారంభించారని తెలిపారు. అందువల్లే హైదరాబాద్ లో ఫార్మా పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఆ నాటి చర్యల వల్లే
హైదరాబాద్‌ అభివృద్ధి పథంలోకి వెళ్లిందన్నారు.

Read More: కొండగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి..


రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు. అవుటర్‌ రింగు రోడ్డు అంశాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓఆర్ఆర్ అవసరమా అని గతంలో చాలా మంది ప్రశ్నించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఓఆర్ఆర్ హైదరాబాద్ కు లైఫ్‌లైన్‌గా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు.

Related News

BRS Party: ఓరుగల్లులో కారు ఖాళీ అయినట్లేనా?

TSPSC Group -1: వాయిదాల జాతర.. తెరవెనుక ఉన్నదెవరు.. అడ్డుపడుతున్నదెవరు?

Musi Riverfront Document: మూసీ నది పునరుజ్జీవనం.. ఆపై హైదరాబాద్‌కు పునరుత్తేజం

Revanth On Musi River: సీఎంతో జాగ్రత్త.. నేతలతో కేసీఆర్ మంతనాలు..!

Anvitha Builders : అన్విత… నమ్మితే అంతే ఇక..!

BRS Working President Ktr : మంత్రి కొండా సురేఖ కేసులో రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్, వాంగ్మూలాలు తీసుకోనున్న న్యాయస్థానం

Kcr Medigadda : మరోసారి కోర్టుకు కేసీఆర్ డుమ్మా.. న్యాయపోరాటం ఆగదన్న పిటిషనర్

Big Stories

×