EPAPER

Bihar Road Accident: క్యాటరింగ్‌కు వెళ్లి తిరిగొస్తూ అనంతలోకాలకి.. బిహార్‌ రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి..

Bihar Road Accident: క్యాటరింగ్‌కు వెళ్లి తిరిగొస్తూ అనంతలోకాలకి.. బిహార్‌ రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి..
Bihar Road Accident

9 killed in Bihar Road Accident: బిహార్‌లోని లఖిసరాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జులోన్నా గ్రామ సమీపంలో జాతీయ రహదారి 30పై జరిగిన ప్రమాదంలో 9 మంది మరణించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పీఎంసీహెచ్‌ పాట్నాకు తరలించారు.


ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది గాయపడినట్లు సమాచారం. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్థరాత్రి లారీ-టెంపో ఢీకొన్నాయి. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషయంపై విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

స్థానికుల ప్రకారం, మంగళవారం అర్థరాత్రి 12 మందికి పైగా ప్రజలు పెళ్లిలో క్యాటరింగ్ పని ముగించుకుని టెంపోలో తిరిగి వస్తున్నారు. అప్పుడు వేగంగా వచ్చిన లారీ టెంపోను ఢీకొట్టింది.


Read More: ప్రముఖ న్యాయనిపుణుడు ఫాలి ఎస్ నారీమన్ కన్నుమూత..

ఈ ప్రమాదంలో ముంగేర్‌ జిల్లా జమాల్‌పూర్‌ ఛోటీ కేశోపూర్‌ నివాసి 24 ఏళ్ల కవల సోదరులు వికాస్‌ కుమార్‌, వినయ్‌ కుమార్‌, చేతన్‌, 20 ఏళ్ల దీవానా కుమార్‌, 18 ఏళ్ల అమిత్‌ కుమార్‌, 18 ఏళ్ల మోను కుమార్‌, 17 ఏళ్ల రోహిత్‌ పాశ్వాన్‌, టాటర్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేశ్వర గ్రామానికి చెందిన 18 ఏళ్ల అనుజ్ కుమార్, ఆటో డ్రైవర్ మనోజ్ గోస్వామి మృతి చెందారు.

సాగర్ కుమార్, హృతిక్ కుమార్, సుశీల్ కుమార్ సహా ఐదుగురు గాయపడ్డారు. ప్రతి ఒక్కరినీ సదర్ ఆసుపత్రి నుంచి పీఎంసీహెచ్‌కి చికిత్స కోసం రెఫర్ చేశారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటనకు సంబంధించి లఖిసరాయ్ నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ జుల్నా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

“ప్రమాద సమాచారం అర్థరాత్రి అందింది. సమాచారం అందుకున్నాక సంఘటనా స్థలానికి చేరుకున్నాం. పోలీసు బృందం వచ్చేసరికి 9 మంది చనిపోయారు. అందరూ హల్సీ నుంచి తిరిగి వస్తున్నారు. మృతులు ముంగేర్ వాసులు. ప్రమాదం గురించి కుటుంబీకులకు సమాచారం అందించాము. ప్రస్తుతం దీనిపై తదుపరి విచారణ జరుగుతోంది” అని ఎస్సై అమిత్ తెలిపారు.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×