EPAPER

Medaram Jathara: నేటి నుంచే మేడారం మహాజాతర.. ఇవ్వాళ గద్దెపైకి రానున్న సారలమ్మ!

Medaram Jathara: నేటి నుంచే మేడారం మహాజాతర.. ఇవ్వాళ గద్దెపైకి రానున్న సారలమ్మ!
Medaram Jathara

Medaram Jathara LIVE Updates: జనం మెచ్చిన జనజాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. మేడారం మహాజాతరకు ముస్తాబయ్యింది. నేడు గద్దెపైకి సారలమ్మ రాకతో ఈ పండుగ మొదలవుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెనెక్కుతుంది. ఇక పూనుగొండ్ల నుంచి ఇప్పటికే పగిడిద్దరాజు బయలెల్లారు. ఇక కొండాయి నుంచి గోవిందరాజు నేడే గద్దెపైకి చేరుకుంటారు.


సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ఒకేరోజు గద్దెలపైకి చేరుకుంటారు. ఇప్పటికే మంగళవారం సాయంత్రం జంపన్న మేడారానికి చేరుకున్నారు. రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటారు. ఇప్పటికే 15 లక్షల మందికి పైగా భక్తులు మేడారంలో మొక్కులు సమర్పించుకున్నారు.

జాతర ప్రారంభమైన మూడో రోజు జనం అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకుంటారు. అదే రోజు(ఫిబ్రవరి 23) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసైలు వనదేవతలను దర్శించుకోనున్నారు. దీంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు.


Read More: మేడారం భక్తులు.. ఈ రూట్ మ్యాప్ ఫాలో కావాల్సిందే.. !

తెలంగాణ ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో మేడారానికి అధిక సంఖ్యలో మహిళలు వస్తున్నారు. ఇప్పటికే అధికారులు పలు రూట్లలో వచ్చే వాహనాలకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు.

Tags

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×