EPAPER

IPL 2024 Schedule: ఐపీఎల్ హంగామా.. మార్చి 22 నుంచి ప్రారంభం

IPL 2024 Schedule: ఐపీఎల్ హంగామా.. మార్చి 22 నుంచి ప్రారంభం
IPL 2024

IPL 2024 Starts from March 22: భారత క్రికెట్ అభిమానులు ధనాధన్ క్రికెట్ ని ఎక్కువ ఇష్టపడతారు. అంతేకాదు కలర్ ఫుల్ గా నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ లంటే ఇంకా ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. ఒకవైపు నుంచి తమ అభిమాన క్రికెటర్లు, మరోవైపు ప్రపంచంలో మేటి క్రికెటర్లు అంతా ఒకొక్క జట్టులో కలిసి మెలిసి ఆడుతూ ఉంటారు. అది చూసేందుకు రెండు కళ్లు చాలవని అభిమానులు అంటారు.


మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పవచ్చు. కానీ తన ఆటని మిస్ కాకుండా చూపించే అద్భుతమైన వేదిక ఐపీఎల్. ఇటువంటి ఎన్నో మెమరీలను మోసుకొస్తూ, 2024 ఐపీఎల్ సీజన్ కి సిద్ధమైంది. అయితే మార్చి 22 నుంచి ప్రారంభమవనుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ తెలిపారు. చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. రెండు విడతలుగా ఐపీఎల్ 2024 జరగనుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ కోసం వేచిచూస్తున్నామని చెప్పారు.

మరోవైపున ఐసీసీ టీ 20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడు ఐపీఎల్ లో ఆడే క్రికెటర్లు చాలామంది వివిధ దేశాల ప్రపంచ కప్ టీమ్ ల్లో ఉన్నారు. వారిని మే నెల 20 తర్వాత సత్వరం వారి వారి దేశాలకు పంపించాల్సి ఉంటుంది. లేదంటే టోర్నమెంట్ జరిగే అమెరికా అయినా వెళ్లాల్సి ఉంటుంది. ఈ తలనొప్పులు ఎందుకని, ఈలోపునే ఐపీఎల్ ని ముగిద్దామని అనుకుంటున్నారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రభుత్వాధికారులతో చర్చిస్తుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ చెప్పారు.


Read More: డీప్‌ఫేక్ బారిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..

ఎన్నికల తేదీలు, సెక్యూరిటీ విషయంపై భారత హోమ్ మంత్రిత్వశాఖతో సంప్రదిస్తున్నట్టు తెలిపారు. అయితే ఒక ఆలోచనగా ఐపీఎల్ షెడ్యూల్‌ను రెండు దశలుగా ప్రకటించాలని అనుకుంటున్నామని అన్నారు. ఐపీఎల్ 2019 మాదిరే కొన్ని మ్యాచ్‌లను ఎన్నికల షెడ్యూల్‌ ముందు, కొన్ని మ్యాచ్ లను ఎన్నికలు అయిపోయిన తర్వాత నిర్వహిస్తామని అన్నారు. ఇది ఒక ఆలోచన మాత్రమేనని చెప్పుకొచ్చారు.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×