EPAPER

Zombie Deer Disease: అమెరికాలో మరో కొత్త జాంబీ వైరస్ కలకలం.. మనుషులకు సోకే చాన్స్

Zombie Deer Disease: అమెరికాలో మరో కొత్త జాంబీ వైరస్ కలకలం.. మనుషులకు సోకే చాన్స్

Zombie Deer Disease: కరోనా వైరస్ తో అల్లకల్లోలమైన ప్రపంచ దేశాలను మరో వ్యాధి కలవరపెడుతోంది. కరోనా వలన కలిగినటువంటి దారుణమైన పరిస్థితులను ప్రపంచమే చూసింది. ఇకపోతే, ప్రస్తుతం, అమెరికాలో, కొత్తగా ఒక వ్యాధి చోటుచేసుకుంది. ఇది కరోనా లాగే అందరికీ పాకుతుందా..? అంత ప్రమాదకరమైనదా..? అనే అంశంపై పరిశోధనలు మొదలు పెట్టారు శాస్త్రవెత్తలు.


అగ్రరాజ్యం అమెరికా వ్యాప్తంగా జింకల్లో జాంబీ డీర్ డిసీజ్ కేసులు పెరుగుతున్నాయి. దీని వలన వందలాది జంతువులు ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు గుర్తిస్తున్నారు శాస్త్రవెత్తలు. ఈ వ్యాధి ముఖ్యంగా అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ లోని జంతువుల్లో కనుగొన్నారు. ఈ వ్యాధి జంతువులు నుంచి మనుషులకూ వ్యాపిస్తుందనే ఆందోళన మొదలయ్యింది. ఇదొక నాడీ సంబంధిత అంటు వ్యాధి. ఇది సోకిన ప్రతి జంతువూ చనిపోతుంది. తీవ్రతను తెలుసుకునేందుకు రోడ్డు ప్రమాదానికి గురైన జింకలు, దుప్పులు, ఎల్స్, కారిబౌలను పరీక్షించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

జాంబీ డీర్ డిసీజ్ ప్రముఖంగా ఉత్తర అమెరికా, నార్వే, కెనడా, దక్షిణ కొరియా వంటి ప్రాంతాల్లోని జింక, లేళ్లు, దుప్పి వంటి జంతువుల్లో ప్రబలంగా ఉన్నట్లు సమాచారం. దీని కారణంగా బద్ధకంగా ఉండడం, తూలిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి నాడీ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి.


జాంబీ డీర్ డిసీజ్ ప్రధానంగా జంతువులకే సంక్రమిస్తుంది. కానీ, చివరికి మానవులకు కూడా సంక్రమించే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ‘జాంబీ డీర్‌ డిసీజ్‌’ని వైద్య పరిభాషలో (క్రానిక్‌ వేస్టింగ్‌ డిసీజ్‌(సీడబ్ల్యూడీ) అంటారు. అంటే ప్రోటీన్‌ ముడతల్లో తేడాలతో వచ్చే అరుదైన వ్యాధి ఇది. దీన్ని చాలా నెమ్మదిగా చుట్టుముట్టే ప్రమాదకర వ్యాధిగా శాస్త్రవెత్తలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మనుషులకు సోకిన దాఖలాలు లేకపోయినా.. భవిష్యత్తులో మానవులకు సోకకుండా ఉండే గ్యారంటీ లేదని ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్‌లో వచ్చిన ‘మ్యాడ్‌ కౌ వ్యాధి(పిచ్చి ఆవు వ్యాధి)’ గుర్తు చేసుకున్నారు శాస్త్రవెత్తలు. వందలకొద్ది ఆవులను వధించడంతో వచ్చిన పిచ్చి ఆవు వ్యాధి ఎలా మానువులకు సంక్రమించిందో ఉదహరిస్తూ వార్నింగ్‌ ఇస్తున్నారు నిపుణులు.

Read More: ERS-2 ఉపగ్రహం కూలేది రేపే..

ఈ మేరకు సీడబ్ల్యూడీ పరిశోధకుడు డాక్టర్‌ కోరి ఆండర్సన్‌ మాట్లాడుతూ..మానువులకు వస్తుందా? రాదా? అని నిర్థారించి చెప్పకలేకపోయినప్పటికీ.. సంసిద్ధగా ఉండటం మాత్రం ముఖ్యమని నొక్కిచెప్పారు శాస్త్రవెత్తలు. ఇది ఒక ప్రాంతంలో వ్యాప్తి చెందితే.. పూర్తి స్థాయిలో తొలగించడం అసాధ్యం అంటున్నారు శాస్ర్తవెత్తలు. ఇది ఆయా భూభాగంలోని మట్టి లేదా ఉపరితలాల్లో ఏళ్లుగా ఆ వ్యాధి కొనసాగుతుందని చెబుతున్నారు. ఇది ఒక రకమైన ప్రోటీయోపతి లేదా నిర్మాణపరంగా అసాధారణమైన ప్రోటీన్ల వ్యాధి.

ఇది సోకిన జంతువులు కానీ మానవులు కానీ మరణిస్తే అక్కడ భూమిలోనే డికంపోజ్‌ అయితే అలానే ఆ వ్యాధి తాలుకా గ్రాహకాలు కొంత కాలం వరకు నేలలో ఉండిపోతాయని చెబుతున్నారు శాస్త్రవెత్తలు. దీంతో కొన్నేళ్ల పాటు ఆయా ప్రాంతాల్లో ఆ వ్యాధి కొనసాగుతుంది. ఎలాంటి క్రిమి సంహరకాలు, ఫార్మాల్డిహైడ్‌, రేడియేషన్‌ల, అధిక ఉష్ణోగ్రతలకు ఆ వ్యాధి లొంగదని మరింతగా నిరోధకతను చూపిస్తుందని అన్నారు. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) 1997 నుంచే సీడబ్ల్యూడీకి సంబంధించిన వ్యాధులు మానవులకు సంక్రమించకుండా నిరోధించే ప్రాముఖ్యత గూర్చి నొక్కి చెబుతుండటం గమనార్హం.

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×