EPAPER

Medaram Jatara: మేడారం భక్తులు.. ఈ రూట్ మ్యాప్ ఫాలో కావాల్సిందే!

Medaram Jatara: మేడారం భక్తులు.. ఈ రూట్ మ్యాప్ ఫాలో కావాల్సిందే!

Medaram Jatara Route Map: ఆసియాలోనే అతి పెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే వేలాది మంది మేడారం బాట పట్టారు. అటు ఆర్టీసీ, పలు ప్రైవేటు సంస్థలు ఇక్కడికి వచ్చే భక్తుల కోసం రవాణా ఏర్పాట్లు చేస్తుండగా, గూడుబళ్లలో తరలివచ్చే లక్షలాది ఆదివాసీలు, గిరిజనులు ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నాలుగు రోజుల్లోనే సుమారు కోటి మంది ఈ జాతరకు వస్తారని అంచనా.


ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ జాతరకు వచ్చే యాత్రీకుల కోసం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. నేటి (మంగళవారం) నుంచి మేడారం వెళ్లే దారుల్లో ‘ వన్‌ వే’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు ఈ ట్రాఫిక్‌ రూల్స్‌ అమల్లో ఉంటాయన్నారు. అలాగే.. ‘మేడారం జాతర’ పేరుతో ఒక ప్రత్యేక మొబైల్‌ యాప్‌‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి జరిగే మహాజాతరకు 5 లక్షలకు పైగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున.. వీటికోసం నెల రోజులు శ్రమించి, 20 కి.మీ పరిధిలోని 1400 ఎకరాల్లో 33 పార్కింగ్‌ స్లాట్లనూ పోలీసులు ఇప్పటికే ఏర్పాటు చేశారు.

ఇక.. మేడారానికి వెళ్లే రూట్స్ విషయానికి వస్తే.. వరంగల్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్‌, హన్మకొండ నుంచి వచ్చే వాహనాలన్నీ గుడెప్పాడ్‌ మీదుగా ములుగు దాటి.. పస్రా వద్ద క్రాస్ చేసుకుని నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్లబుద్ధారం, కమలాపురం క్రాస్ మీదుగా భూపాలపల్లి, రేగొండ, పరకాల, గుడెప్పాడ్‌ క్రాస్‌ దగ్గర కుడివైపుకు మళ్లి.. నల్గొండ, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్‌ వెళ్లిపోవాలి.


Also Read: Medaram Jathara: నేటి నుంచే మేడారం మహాజాతర.. ఇవ్వాళ గద్దెపైకి రానున్న సారలమ్మ..

ఖమ్మం, మహబూబాబాద్ నుంచి వచ్చే వెహికిల్స్‌ నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లి హైవే దగ్గర కలిసి.. ములుగు, పసర, నార్లాపూర్, మీదుగా మేడారం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో గుడెప్పాడ్‌ దగ్గర లెఫ్ట్‌ తీసుకొని మల్లంపల్లికి వచ్చి ఖమ్మం, మహబూబాబాద్ వైపు కదలాలి.

పై రెండు మార్గాల వారికోసం ఊరట్టం క్రాస్‌ నుంచి ప్రాజెక్ట్‌ నగర్‌ వరకు పార్కింగ్‌ స్లాట్లు కేటాయించారు.

ఇక.. గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం నుంచి వచ్చే భక్తుల వాహనాలు కాటారం నుంచి క్రాస్‌ చేసుకొని చింతకాని, యామన్‌ పల్లి, పెగడపల్లి, సింగారం, కాల్వపల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. వీరికి ఊరట్టం దగ్గరే పార్కింగ్‌ ఉంది. తిరుగు ప్రయాణంలోనూ వీరి వాహనాలను ఇదే రూట్‌లో వెళ్లిపోవచ్చు. అవసరమైతే నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్లబుద్ధారం, కమలాపురం క్రాస్ మీదుగా కూడా వెళ్లొచ్చు.

భద్రాచలం, ఛత్తీస్‌ఘడ్, మణుగూరు నుంచి వచ్చే వాహనాలు ఏటూరు నాగారం, చిన్న బోయినపల్లి దగ్గర క్రాస్‌ చేసుకొని కొండాయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకోవాలి. వీళ్లకోసం ఊరట్టం దగ్గరలోనే పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ వాహనాలు కూడా తిరుగుప్రయాణంలో ఇదే మార్గంలో వెళ్లాలి.

ఆర్టీసీ బస్సులు, వీఐపీ, వీవీఐపీ వెహికిల్స్‌ అన్నీ కూడా తాడ్వాయి దగ్గర క్రాస్‌ తీసుకొని మేడారం చేరుకోవాలి. తిరిగి ఇదే రూట్‌లో ఈ వాహనాలను పంపిస్తారు.

ఇక.. పార్కింగ్ విషయానికి వస్తే.. ఆర్టీసీ బస్సులను తాడ్వాయి-మేడారం రూట్‌లో బస్టాండ్‌ ప్లేస్‌లో పార్క్‌ చేయాలి. పస్రా-మేడారం రూట్‌లో జంపన్నవాగు దగ్గర నుంచి ప్రైవేట్‌ వెహికిల్స్‌ పార్క్‌ చేసుకోవచ్చు. వీఐపీ, వీవీఐపీలకు గద్దెలకు దగ్గరలోనే పార్కింగ్‌ ప్లేస్‌లను కేటాయించారు. పార్కింగ్‌ స్థలంలోనే టాయిలెట్స్​, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి కల్పించారు

Tags

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×