EPAPER

Sarfaraz Khan: 15 ఏళ్లు, రోజూ 500 బంతుల ప్రాక్టీసు.. ఇదే సర్ఫరాజ్ విజయ రహస్యం

Sarfaraz Khan: 15 ఏళ్లు, రోజూ 500 బంతుల ప్రాక్టీసు.. ఇదే సర్ఫరాజ్ విజయ రహస్యం
Secret of Sarfaraz Khan success

Secret of Sarfaraz Khan Success: నిజానికి ఆరంగేట్రం మ్యాచ్ అనగానే అందరిలో కంగారు వస్తుంది. మరి సర్ఫరాజ్ ఎందుకంత సాధికారికంగా ఆడుతున్నాడు. అసలు తను ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నట్టుగానే కనిపించడం లేదు. ఏదో పిల్లలు స్కూల్ టీమ్ లో ఆడినంత సులువుగా మూడో టెస్ట్ ఆడేశాడు. అరంగేట్రం టెస్టులోనే రెండు అర్ధ సెంచరీలు సాధించి భళా అనిపించాడు.


స్పిన్ పై ఇంత పట్టు ఎలా సాధించాడని నెట్టింట అందరూ వెతుకుతుంటే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఇంగ్లండ్ స్పిన్నర్లపై ఖాన్ ఆధిపత్యం యాదృచ్ఛికం కాదని అంటున్నారు. తన తండ్రి నౌషాద్ ఖాన్ మార్గదర్శకత్వంలో 15 ఏళ్ల పాటు ప్రతిరోజూ 500 బంతులు ఆడిన కృషి ఫలితమే రాజ్ కోట్ లో అతని అద్భుత ఆట తీరుకి నిదర్శనమని అంటున్నారు.

అరంగేట్రం టెస్టులో ఆత్మవిశ్వాసంతో రెండు అర్ధ సెంచరీలు సాధించడం ద్వారా భారత జట్టులో తనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని సర్ఫరాజ్ నిరూపించాడు. 26 ఏళ్ల క్రికెటర్ తన తండ్రి ‘ క్రికెట్ క్లబ్’లో నైపుణ్యాలను మెరుగుపరుచుకున్న తర్వాత కొన్నేళ్లుగా దేశీయ క్రికెట్‌లో  టన్నుల కొద్దీ పరుగులు చేసిన తర్వాత జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు.


Read more: పంజాబ్ ఎన్నికల ప్రచారంలో.. శుభ్ మన్ గిల్..!

రాజ్‌కోట్‌లో టామ్ హార్ట్ లీ, జో రూట్,  రెహాన్ అహ్మద్ వంటి అంతర్జాతీయ స్పిన్నర్లను సర్ఫరాజ్‌ అలవోకగా ఎదుర్కొన్నాడు. ఒక క్రమబద్ధమైన ప్రణాళిక కారణంగానే అది సాధ్యపడిందని అంటున్నారు. ముంబయిలోని ఓవల్, క్రాస్, ఆజాద్ మైదానాల్లో ప్రతిరోజూ 500 బంతులు ఆఫ్, లెగ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఆడేవాడు. అందువల్లే ఇది సాధ్యమైందని సర్ఫరాజ్ పురోగతిని నిశితంగా గమనించిన ముంబై కోచ్ చెప్పాడు.

ఎంతో కఠినమైన శిక్షణ పొంది టీమ్ ఇండియా వరకు సర్ఫరాజ్ చేరుకున్నాడని అంటున్నారు. సర్ఫరాజ్‌ని సిద్ధం చేసిన ఘనత తండ్రి నౌషాద్‌కే దక్కదు. పేసర్లు భువనేశ్వర్ కుమార్ కోచ్ సంజయ్ రస్తోగి, మహ్మద్ షమీ కోచ్ బద్రుద్దీన్ షేక్, కుల్దీప్ యాదవ్ కోచ్ కపిల్ దేవ్ పాండే, గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ భరద్వాజ్, ఇండియా ఎ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ తండ్రి ఇలా ఎంతోమంది సర్ఫరాజ్ ఎదుగుదలకు తోడ్పడ్డారని చెబుతున్నారు.

చూశారా, ఒక జాతీయ జట్టులోకి రావడానికి సర్ఫరాజ్ ఎక్కడెక్కడ తిరిగాడో, ఎంతమందిని కలిశాడో, ఎందరి కోచ్ ల దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడో, ఒక విజయం దక్కిందంటే దాని వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంటుందనడానికి సర్ఫరాజే ఉదాహరణ అని చెబుతున్నారు. యువతకు సర్ఫరాజ్ స్ఫూర్తిదాయకమని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×