EPAPER

APPSC: నిరుద్యోగులకు ఉపశమనం.. ఒకేరోజు రెండు పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం!

APPSC: నిరుద్యోగులకు ఉపశమనం.. ఒకేరోజు రెండు పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం!
APPSC Latest News

APPSC Latest News: ఏపీలోని నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. అయితే ఒకేరోజు రెండు పరీక్షలు పడటంతో సతమతమవుతున్న ఉద్యోగ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ క్లరికల్ ఎగ్జామ్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలు ఒకే రోజు ఉన్నాయి. పరీక్షల తేదీలో మార్పు చేయాలంటూ ఎస్బీఐకు ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు.


ఫిబ్రవరి 25న ఎస్‌బీఐ క్లర్కు పరీక్ష ఉంది. అయితే అదే రోజు ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్షను నిర్వహిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు అయోమయంలో పడిపోయారు. కొంతమంది అభ్యర్థులు రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవటంతో ఏదో ఒక పరీక్షకు మాత్రమే హాజరవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ తీరుపై ఉద్యోగ అభ్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జాతీయస్థాయి పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా.. గ్రూప్-2 పరీక్ష తేదీని నిర్ణయించడం ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగ అభ్యర్థులు. ఏపీపీఎస్సీ ఏమీ ఆలోచించకుండానే ఎస్‌బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్ష జరుగుతున్న రోజునే.. గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను షెడ్యూల్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సాధారణంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి పరీక్షల తేదీని ఖరారు చేసేటప్పుడు ఇతరత్రా పరీక్షల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు.


Read More: ఎన్నికల వేళ.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..

అయితే ఏపీపీఎస్సీ ఏమీ ఆలోచించకుండానే గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష తేదీని షెడ్యూల్ చేసిందనే విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్షల తేదీని మర్చాలని ఎస్‌బీఐకు లేఖ రాసింది ఏపీపీఎస్సీ. అయితే లేఖపై ఎస్‌బీఐ ఎలా స్పందిస్తుందనేదీ చూడాలి మరి.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×