EPAPER

Drug trafficking: పోలీసుల నుంచి తప్పించుకున్న పంజాబ్‌ డ్రగ్స్‌ రవాణా కేసు నిందితుడు

Drug trafficking: పోలీసుల నుంచి తప్పించుకున్న పంజాబ్‌ డ్రగ్స్‌ రవాణా కేసు నిందితుడు

drug trafficking Accused escaped from police: పంజాబ్‌ డ్రగ్స్‌ రవాణా కేసులోని నిందితుల్లో ఒకరైన జోబంజిత్‌ సింగ్‌ సంధు పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నాడు. నిందితున్ని కచ్‌లోని భుజ్‌ జైలులో ఉంచారు. అక్కడి నుంచి కేసుకు సంబంధించి కోర్టులో హాజరుపరిచేందుకు అమృత్‌సర్‌కు తరలిచారు. తిరిగి కచ్‌కు వస్తుండగా మార్గం మధ్యలో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు.


దీంతో పోలీసులు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుని కోసం స్థానిక పోలీసుల సహాయంతో సెర్చ్‌ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. అతనిని పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారి వెల్లడించారు.

Read More: సీట్ల లెక్కలు తేల్చండి.. కాంగ్రెస్ కు అఖిలేష్ అల్టిమేటం..


2021లో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో 2,988 కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. ఈ డ్రగ్స్ విలువ 21000 కోట్లు డాలర్లు ఉంటుందని అంచన. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో రిజిస్టరైన ఓ ట్రేడింగ్ కంపెనీ డ్రగ్‌ను దిగుమతి చేసుకుంటుండగా అధికారులు అడ్డుకున్నారు. సెమీ ప్రాసెస్డ్ టాల్క్ రాళ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది.

ఆఫ్ఘనిస్థాన్‌లో డ్రగ్స్‌ను ఉత్పత్తి చేసి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్ ద్వారా ముంద్రా పోర్టుకు తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. అహ్మదాబాద్‌, ఢిల్లీ, చెన్నై, గాంధీధామ్‌, గుజరాత్‌లోని మాండ్వీలలోని పలు చోట్ల ఈ ఏజెన్సీలు దాడులు నిర్వహించాయి. ట్రేడింగ్ కంపెనీ యజమానులు ఎం సుధాకర్, ఆయన భార్య జి దుర్గా పూర్ణ వైశాలి సహా పలువురిని అరెస్టు చేశారు. ఏడు సంస్థలు, 42 మందిపై కేసు నమోదు చేశారు.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×