EPAPER

Ben Stokes: అంపైర్ కాల్.. కరెక్టుగా లేదు: ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్

Ben Stokes: అంపైర్ కాల్.. కరెక్టుగా లేదు: ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్
IND vs ENG Test Series - Ben Stokes

IND vs ENG Test Series – Ben Stokes : ఇంగ్లాండ్ కి వ్యతిరేకంగా వచ్చిన మూడు అంపైర్ కాల్స్ మ్యాచ్ ని తలకిందులు చేశాయని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. రాజ్ కోట్ లో జరిగిన మూడో టెస్ట్ లో ఘోర ఓటమిపై  స్పందించాడు. 


నిజానికి బజ్ బాల్ వ్యూహంతో ఇంగ్లాండ్ ముందు కెళుతోంది. ఈ క్రమంలో ఇంత ఘోర పరాజయాన్ని ఈ మధ్యకాలంలో చవి చూడలేదు. ఈ ఓటమిపై ఇంగ్లాండులో కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే ఎంత బజ్ బాల్ ఆడినా, ఒక మూడు వికెట్ల వరకు చూసి, తర్వాత నుంచి నెమ్మదించాలని, వెంటనే టెస్ట్ మోడ్ లోకి వచ్చేయాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ అంటున్నాడు. వీరు మొదటి వికెట్ నుంచి చివరి వరకు కొట్టేద్దామనే ఉద్దేశంతోనే వెళుతున్నారని సీరియస్ అయ్యాడు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఆడాలని సూచించాడు.


ఈ విషయంపై బెన్ స్టోక్స్ మాట్లాడుతూ మూడు అవుట్లు మాకు వ్యతిరేకంగా వచ్చాయని అన్నాడు. ఒకటి జాన్ క్రాలే డీఆర్ఎస్ ను గమనిస్తే బాల్ వికెట్ల పై నుంచి వెళ్లినట్టు కనిపించింది. దీనిపై స్పష్టత లేదు. కానీ థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడని తెలిపాడు.

సెకండ్ ఇన్నింగ్స్ లో నాలుగు ఎల్బీలున్నాయని అన్నాడు. జాక్ క్రాలే, బెయిర్ స్టో, జోరూట్, నేను అలా అవుట్ అయ్యాం. వీటిలో మూడింటిలో అనుమానాలున్నాయని అన్నాడు. హాక్ ఐ టెక్నాలజీ ఇంకా మెరుగైతే బాగుంటుందని అన్నాడు. ఇప్పుడు ఓటమి పాలయ్యాం కాబట్టి, డీఆర్ఎస్ ని నిందిస్తే, ఏదో సాకు చెప్పినట్టవుతుందని అన్నాడు.

అది చిన్నపిల్లల ఆటలా ఉంటుంది. కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటంటే సాంకేతికత ఇంకా మెరుగు పడాల్సిన అవసరమైతే ఉందని అన్నాడు. అలాగని నేను అంపైర్లను తప్పు పట్టడం లేదు. వారి కష్టం నాకు తెలుసని అన్నాడు. నిజానికి మేం బ్యాటింగ్ చేసి, అవుట్ అయితే డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుని ఆట చూస్తుంటాం.

కానీ అంపైర్లు అలా కాదు, ఐదురోజులు గ్రౌండులో నిలబడాలి. నో బాల్స్, వైడ్స్ , రన్ అవుట్లు, ఎల్బీలు ఇలా ఒకటి కాదు ఏక కాలంలో ఎన్నో చూడాల్సి ఉంటుంది. 

అంతేకాదు ఇండియాలాంటి టర్నింగ్ పిచ్ లపై ఇంకా ఏకాగ్రత అవసరమని అన్నాడు. అందుకని వారిని నిందించడం లేదు. కానీ డీఆర్ఎస్ విధానంపై ఒక చర్చ జరగాలని మాత్రమే కోరుకుంటున్నానని తెలిపాడు.

డీఆర్ఎస్ అంశంపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పలు సందర్భాల్లో అసంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. బహుశా బెన్ స్టోక్స్ మాటలు ఎటు దారితీస్తాయోనని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×