EPAPER

Deepika Padukone @ BAFTA 2024: BAFTAలో మెరిసిన దీపిక.. చీరకట్టుతో భారతీయతను చాటిన నటి!

Deepika Padukone @ BAFTA 2024: BAFTAలో మెరిసిన దీపిక.. చీరకట్టుతో భారతీయతను చాటిన నటి!
Deepika Padukone latest news

Deepika Padukone Represents Indian Culture In Saree: బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌(BAFTA) అవార్డుల ప్రదానోత్సవం లండన్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో దీపిక పదుకొణె భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరకట్టులో మెరిశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక భారతీయ నటి దీపిక కావడం విశేషం.


లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో 77వ బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌(బీఏఎఫ్‌టీఏ) వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకొణె వేదికపై ప్రసంగించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ మారింది. ఆ అవార్డ్ ప్రదానోత్సవంతో ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ బీఏఎఫ్‌టీఏ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ప్రజెంటర్‌గా వ్వవహరించారు.

ఈ వేడుకలో దీపిక భారతీయతను సగర్వంగా చాటింది. బంగారు వర్ణంలోని చీరను ధరించిన ఆమె ప్రేక్షకుల హర్షద్వానాల మధ్య అవార్డును అందజేసేందుకు వేదికపైకి వెళ్లింది. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ఇండియన్‌ క్వీన్‌’ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు. ‘బెస్ట్‌ ఫిల్మ్‌ నాట్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌’ కేటగిరీలో ఆమె అవార్డును ప్రదానం చేశారు.


Read More: ప్లాస్టిక్ సర్జరీ ట్రోలింగ్ పై స్పందించిన నాగార్జున హీరోయిన్ అయేషా..!

ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన చిత్రం‘ఓపెన్‌హైమర్‌’. ఈ సినిమా బీఏఎఫ్‌టీఏ అవార్డుల్లో సత్తా చాటింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నటుడు, ఉత్తమ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో పాటు మొత్తం ఏడు విభాగాల్లో అవార్డులను అందుకుంది. క్రిస్టోఫర్‌ నోలన్‌కు దర్శకుడిగా దక్కిన తొలి బీఏఫ్టీఏ అవార్డ్‌ ఇదే కావడం విశేషం.

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×