EPAPER

Oppenheimer: బాఫ్టా అవార్డుల్లో ఓపెన్‌హైమర్ దే హవా.. ఎన్ని విభాగాల్లో తెలుసా?

Oppenheimer: బాఫ్టా అవార్డుల్లో ఓపెన్‌హైమర్ దే హవా.. ఎన్ని విభాగాల్లో తెలుసా?

Oppenheimer wins 7 prizes in BAFTA 2024: ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ మూవీ ‘ఓపెన్‌హైమర్’ మరోసారి రికార్డు సృష్టించింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్‌ హాల్‌లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు(BAFTA)ల వేడుకలో ఈ సినిమా తన సత్తా చాటింది. 2024 ఏడాదికి సంబంధించి ఈ సినిమాకు అవార్డుల పంట పండింది.


ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడితో పాటు మొత్తం ఏడు విభాగాల్లో ఈ సినిమాకు అవార్డులు దక్కాయి. కాగా క్రిస్టోఫర్ నోలన్‌కు దర్శకుడిగా ఇదే తొలి BAFTA అవార్డు కావడం విశేషం. ఇక ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులను దక్కించుకున్న ఈ సినిమా వచ్చే నెల మార్చిలో జరగనున్న ఆస్కార్ రేసులో తన ప్లేస్‌ను మరింత సుస్థిరం చేసుకుంది. కాగా ‘పూర్ థింగ్స్‌’కు ఐదు, ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’కు మూడు అవార్డులు దక్కాయి.

Read More: ‘ఓపెన్‌హైమర్‌’కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల పంట


BAFTA అవార్డు విజేతలు వీరే..

ఉత్తమ చిత్రం – ఓపెన్‌హైమర్

ఉత్తమ దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ నటుడు – సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)

ఉత్తమ సహాయ నటుడు – రాబర్ట్‌డౌనీ జూనియర్(ఓపెన్‌హైమర్)

ఉత్తమ సహాయ నటి – డావిన్ జాయ్ రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ – హోట్ వాన్ హోటిమా (ఓపెన్‌హైమర్)

ఉత్తమ స్క్రీన్ ప్లే – జస్టిన్ ట్రైట్, ఆర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఫాల్)

ఉత్తమ డాక్యుమెంటరీ – 20 డేస్ ఇన్ మరియోపోల్

ఉత్తమ విజువల్స్ – సైమన్ హ్యూస్ (పూర్ థింగ్స్)

ఉత్తమ క్యాస్టింగ్ – ది హోల్డోవర్స్

ఉత్తమ ఎడిటింగ్ – జెన్నీఫర్ లేమ్ (ఓపెన్ హైమర్)

ఉత్తమ స్కోర్ – లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ మేకప్ – నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)

ఉత్తమ సౌండ్ – జానీబర్న్, టార్న్ విల్లర్స్ (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్)

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×