EPAPER

Bank Holidays in March 2024: మార్చిలో బ్యాంకుల సెలవుల లిస్ట్.. ఏకంగా 14 రోజులు బంద్!

Bank Holidays in March 2024: మార్చిలో బ్యాంకుల సెలవుల లిస్ట్.. ఏకంగా 14 రోజులు బంద్!

14 Days Bank Holidays in March 2024: ప్రతినెలా బ్యాంకుల సెలవుల లిస్టును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది. ఫిబ్రవరిలో సెలవులు తక్కువ ఉన్నప్పటికీ.. మార్చిలో బ్యాంకులకు సెలవులు ఎక్కువ. ఈ నెలలో పండుగలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రెండో శనివారం, నాలుగో శనివారం, నాలుగు ఆదివారాలు కాకుండా.. మరో 8 రోజులు బ్యాంకులకు హాలిడేస్ వచ్చాయి. ఈనెలలో లాంగ్ వీకెండ్స్ ఎక్కువగా వచ్చాయి. ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవో తెలుసుకుని, వినియోగదారులు తమ పనులను పూర్తి చేసుకోవాలి.


మార్చి 1 (శుక్రవారం): మిజోరంలో చాప్చార్ కుట్ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఇది మార్చి నెలలో విత్తనాల సీజన్ కు ముందు జరుపుకునే పంట పండుగ.

మార్చి 6 (బుధవారం): మహర్షి దయానంద్ సరస్వతి జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు


మార్చి 8 (శుక్రవారం): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

మార్చి 12 (మంగళవారం): రంజాన్ నెల ప్రారంభం

మార్చి 20 (బుధవారం): మార్చి విషువత్తు

మార్చి 22 (శుక్రవారం): బీహార్ డే. బీహార్ లో బ్యాంకులకు సెలవు

Read More: Donation to Osmania University: ఓయూకు భారీ విరాళమిచ్చిన పూర్వ విద్యార్థి..

మార్చి 23 (శనివారం): భగత్ సింగ్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు

మార్చి 24 (ఆదివారం): ఆదివారం సాధారణ సెలవు. అదే రోజు హోలికా దహనం కూడా.

మార్చి 25 (సోమవారం): హోలీ సందర్భంగా బ్యాంకులకు హాలిడే.

మార్చి 25,26 (సోమవారం, మంగళవారం): యయోషాంగ్ సందర్భంగా మణిపూర్ లో బ్యాంకులకు సెలవు. ఇది వారి ప్రధాన పండుగలలో ఒకటి. పౌర్ణమి రోజు నుంచి ఐదురోజులు జరుపుకునే ప్రత్యేక కార్యక్రమం.

మార్చి 28 (గురువారం): మాండీ గురువారం. క్రిస్టియన్ల పండుగ.

మార్చి 31 (ఆదివారం): ఈరోజు సాధారణ హాలిడే. అలాగే ఈస్టర్ కూడా.

మార్చినెలలో ఇన్ని సెలవులున్నాయి కాబట్టి.. మీ ప్రాంతాల్లో సెలవురోజులను చూసుకుని.. బ్యాంకు లావాదేవీల కార్యకలాపాలను చక్కబెట్టుకోండి.

Tags

Related News

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Gold and Silver Price: బంగారంతో పోటీ పడుతున్న వెండి.. మళ్లీ లక్షకు చేరువలో.. ఇలాగైతే కొనేదెలా ?

Zomato Food Delivery on Train : ఇకపై రైలు ప్రయాణంలోనూ మీకిష్టమైన ఆహారం.. ట్రైన్ లో జొమాటో డెలివరీ!

Big Stories

×