EPAPER

IND Vs ENG 3rd Test: ఇద్దరు అరంగేట్రం ప్లేయర్స్ అదుర్స్..! సర్ఫరాజ్ అరుదైన రికార్డ్.. ధృవ్ అద్భుతమైన రన్ అవుట్!

IND Vs ENG 3rd Test: ఇద్దరు అరంగేట్రం ప్లేయర్స్ అదుర్స్..!  సర్ఫరాజ్ అరుదైన రికార్డ్.. ధృవ్ అద్భుతమైన రన్ అవుట్!
sports news today

Sarfaraz Khan, Druv Jurel Records in India Vs England 3rd Test: రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్ అరుదైన రికార్డు నమోదుచేశాడు. మొదటి టెస్టు‌లో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లో ఆఫ్ సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. తన కంటే ముందు  1934లో ఇంగ్లాండ్‌పై దిలావర్ హుస్సేన్ (59 & 57 ), 1971లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్  (65 & 67* ), 2021లో న్యూజిలాండ్‌పై శ్రేయస్ అయ్యర్ (105 & 65) మాత్రమే సాధించారు. మూడేళ్ల నుంచి జాతీయ జట్టులో స్థానం కోసం సర్ఫరాజ్ ఎదురుచూస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నా బీసీసీఐ కనికరించలేదు. ఎట్టకేలకు సీనియర్ల గైర్హాజరీలో మనవాడికి అనుకోకుండా అవకాశం వచ్చింది. రావడం, రావడంతోనే ఛాన్స్‌ని ఒడిసి పట్టేశాడు. ఒకరకంగా చెప్పాలంటే తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే కనిపిస్తున్నాడు.


వికెట్ కీపర్‌గా ధృవ్ ఇక ఫిక్స్..

టీమ్ ఇండియా మూడోటెస్ట్‌లో ఘన విజయం సాధించింది. ఈ విజయం వెనుక ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వాటిలో ముఖ్యమైనది ధృవ్ చేసిన రన్ అవుట్. ఇంగ్లాండ్ పతనానికి అక్కడ నుంచే నాంది పలికింది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.  ఏడో ఓవర్ బుమ్రా వేశాడు. డకెట్ డిఫెండ్ షాట్ కొట్టి, రన్ మొదలెట్టి పిచ్ సగం వరకు వచ్చేశాడు. మరో ఎండ్‌లో ఉన్న క్రాలే రాకపోవడంతో, తిరిగి వెనక్కి వెళ్లాడు. ఈ క్రమంలో సిరాజ్ అద్భుతంగా త్రో విసిరాడు.


Read More: సర్ఫరాజ్ కోసమే జడేజాను ముందుకు తెచ్చాం.. రోహిత్..!

అప్పటికే వికెట్ల వెనుక ఎంతో దూరంలో ఉన్న ధృవ్ పరిగెత్తుకుంటూ వచ్చి, వికెట్ల పక్క నుంచి వేగంగా వెళుతున్న బంతి మీదకు డైవ్ చేసి, అదే ఊపుతో కుడిచేయివైపునకి తిరిగి వికెట్లను కొట్టాడు. అదెంతో కష్టసాధ్యమైన ఫీట్‌ని అలవోకగా చేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఇదంతా ఫ్యాక్టర్ ఆఫ్ సెకన్లలో జరిగిపోయింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసిన డకెట్, సెకండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి రనౌట్ గా వెనుతిరిగాడు. ఈ రనౌట్ తో మొదలైన ఇంగ్లాండ్ పతనం ఇంక ఆగలేదు. చివరికి 122 పరుగులకి కథ ముగిసిపోయింది.ఈ దెబ్బతో వికెట్ కీపర్ గా ధృవ్ ఫిక్స్ అని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×