EPAPER

Part Time jobs Fraud: న్యూడ్ వీడియో కాల్స్ తో కథ మొదలు.. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో మోసం!

Part Time jobs Fraud: న్యూడ్ వీడియో కాల్స్ తో కథ మొదలు.. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో మోసం!

Part time Jobs Fraud in Kothagudem : నిరుద్యోగులు.. ముఖ్యంగా మహిళా నిరుద్యోగులే టార్గెట్ గా సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. పార్ట్ టైమ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో లింకులు పంపిస్తూ.. డబ్బులు కాజేస్తున్నారు. మనిషి అత్యాశ, అవసరమే కేటుగాళ్ల జేబుల్ని నింపుతున్నాయి. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లను చూశాం. కానీ.. పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మహిళలకు దగ్గరై, వారితో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడి, వాటిని రికార్డ్ చేసి, స్క్రీన్ షాట్స్ తీసి మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.


వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెంకు చెందిన విజయ్ అనే యువకుడు ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి.. పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రచారం చేశాడు. అది చూసి ఎవరైనా అతడిని సంప్రదిస్తే.. అతడి ఉచ్చులో బిగిసినట్టే. వారితో పరిచయం పెంచుకుని.. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడేలా చేస్తాడు. ఆ సమయంలోనే వీడియోలు, ఫొటోలు సీక్రెట్ గా సేకరించి.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తాడు.

తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన యువతి విజయ్ మాయలో పడి.. ఇరుక్కుంది. డబ్బివ్వాలని.. లేదంటే తన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించడంతో.. సదరు యువతి సైబర్ క్రైమ్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఇన్ స్పెక్టర్ సైదులు బృందం.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపింది.


సోషల్ మీడియాలో ఎక్కడైనా పార్ట్ టైమ్ జాబ్ పేరుతో పోస్టులు కనిపిస్తే.. సంప్రదించే ముందు చెక్ చేయాలని, వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలియని వ్యక్తులతో వీడియోకాల్స్, ఆడియోకాల్స్ మాట్లాడటం వంటివి చేయకపోవడం మంచిదని చెబుతున్నారు. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తాం.. డబ్బులివ్వాలని అడిగితే.. అది కచ్చితంగా ఫేక్ అని గ్రహించాలని సూచించారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×