EPAPER

Harish Rao Vs ministers : సై అంటే సై.. ఇది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్!

Harish Rao Vs ministers : సై అంటే సై.. ఇది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్!

War of words between Harish Rao and ministers : ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. సభలో నువ్వా నేనా అన్నట్టుగా నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్పించుకున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే నీటిరంగంపై చర్చ కొనసాగాలని తెలిపారు. పాపాల భైరవుడు కేసీఆర్‌ ను సభకు పిలవాలి అని కోరారు. ముఖం లేక అసెంబ్లీకి రావడం లేదని దుయ్యబట్టారు. హెలికాప్టర్‌ లో కూర్చోని నల్లగొండకు పోవచ్చు కానీ, సభకు మాత్రం రాలేరా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నల్లగొండను నాశనం చేశారన్నారు కోమటిరెడ్డి. సీఎంను, తనను కూడా అరే తురే అంటున్నారు..


అన్ పార్లమెంటరీ భాష మాట్లాడారని సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మంత్రి సీరియస్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్ కేసీఆరే, డిజైనర్ కేసీఆరే, కాంట్రాక్టర్ కేసీఆరే అని వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు మాటలకు విలువ లేదని కొట్టిపారేశారు. ఆయనను కేసీఆర్ కలెక్షన్లకు వాడుకుంటారని.. కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్లు చేయడానికే పనికొస్తారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం మీద ఆయనకు అవగాహన లేదని.. ఇలాంటి కలెక్షన్ కింగ్ చెబితే తాము వినాలా? అని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఇంతటి భారీ తప్పిదాలకు కారణమైన హరీశ్ రావుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభలో గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని అన్నారు. బీఆరఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీ కి అప్పజెప్పిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పుకొచ్చారు.

Read more:  వైట్ పేపర్.. వార్!


బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నిర్వాకం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో విధ్వంసం జరిగిందని.. లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్, దేవాదుల ఎస్సారెస్పీ ప్రాజెక్టులను 32 వేల 848 కోట్ల రూపాయలతో డిజైన్ చేస్తే.. కేసీఆర్ మాత్రం లక్షా 72 వేల కోట్ల రూపాయలకు తీసుకెళ్లారని స్పష్టం చేశారు. రీ డిజైన్ పేరుతో కేవలం వెయ్యి 400 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టును.. కేసీఆర్ 23 వేల కోట్ల రూపాయలకు తీసుకెళ్లారని.. ఇందులో 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని.. అయినా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని.. అలాంటప్పుడు 8 వేల కోట్ల రూపాయలు ఎవరు ఎత్తుకెళ్లారని ప్రశ్నించారు.

రీ డిజైన్ పేరుతో కేసీఆర్ చేసిన అతి పెద్ద తప్పు వల్ల శబరి నదిని తెలంగాణ రాష్ట్రం కోల్పోయిందని.. ఎవరైనా నదులను రాష్ట్రాలకు మళ్లిస్తారని.. కేసీఆర్ మాత్రం కోల్పోయే విధంగా ప్రాజెక్టులు రీ డిజైన్ చేసి.. తెలంగాణకు అన్యాయం చేశారన్నారు భట్టి విక్రమార్క. కాళేశ్వరం కూలిపోవడానికి కారణం బీఆర్ఎస్ అని మంత్రులు ఆరోపించగా.. విచారణ జరిపిస్తే తాము దేనికైనా సిద్ధమే అని హరీశ్ రావు సవాల్ విసిరారు. తాము కట్టించిన బ్యారేజీలు కూలిపోవాలని ప్రభుత్వం చూస్తోందని, అందుకోసమే బ్యారేజీలకు మరమ్మతులు చేయకుండా ఆలస్యం చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన మంచి పనుల ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ చూస్తోందని.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఈ క్రమంలో కాళేశ్వరం పాజెక్టులో లోపాలున్నాయనే విషయాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

ఇక, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులో రిజర్వాయర్లు లేవన్నారు. కేసీఆర్ సభకు రావాలి.. వస్తే ఈ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుందని చెప్పారు. అప్పుడు దేవాలయంగా ఉన్న మేడిగడ్డ ఇపుడు బొందల గడ్డ అయ్యిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలిపోయింది.. మరి ఆనాడు నీటిని ఎందుకు నిల్వ చేయలేదన్నారు. కనిపిస్తున్న దృశ్యాలను కూడా బీఆర్ఎస్ అంగీకరించడం లేదని.. మూడు పిల్లర్లే కాదు.. మరో మూడు ప్రాజెక్టులు డౌటేనన్నారు పొంగులేటి. కొత్త ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదని.. గత సర్కార్ ప్రాజెక్టులపై దోపిడీ చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టులు తొందరగా కట్టాలనే ఆతృత తప్ప.. క్వాలిటీని పట్టించుకోలేదన్నారు.

Tags

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: తిరుపతి లడ్డూలో జంతవుల కొవ్వు వాడకంపై స్పందించిన బండి సంజయ్.. ఏమన్నారంటే?

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×