EPAPER

Stress Relieving Smells: మానసిక ఒత్తిడితో ఇబ్బందా..? ఈ వాసనలు పీలిస్తే పోతుందట!

Stress Relieving Smells: మానసిక ఒత్తిడితో ఇబ్బందా..? ఈ వాసనలు పీలిస్తే పోతుందట!
health tips in telugu

Depression Relieving Scents (news paper today):


మానసిక ఒత్తిడి.. మనిషి జీవితాన్ని చిదిమేస్తుంది. గతం తాలూకు జ్ఞాపకాలు పదే పదే గుర్తొస్తుంటే గుండె తరుక్కుపోయి.. ఆ బాధ కన్నీటి రూపంలో బయటికొస్తుంది. కొందరికి ఎంత ఏడ్చినా.. జరిగింది మరిచిపోలేరు. గతజీవితంలో జరిగిన చెడు విషయాలే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం కావు. ప్రతి విషయంలోనూ ఒత్తిడికి గురికావడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

మన శరీరంలో జరిగే రసాయనిక మార్పులు, హార్మోన్లకు సంబంధించిన మార్పుల వల్ల మానసిక వ్యాధులు పుట్టుకొస్తాయి. ముఖ్యంగా మెదడులోని నాడీ కణాల్లో సెరటోనిన్ అనే రసాయన పదార్థం తగ్గినపుడు డిప్రెషన్ కు గురవుతారు. వీరిలో తరచూ ఆత్మహత్యల ఆలోచనలు, నిద్రరాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


అలాగే మెదడులోని కొన్ని భాగాల్లో డోపమెన్ అనే రసాయన పదార్థం ఎక్కువగా పెరగడంతో.. స్కిజోఫ్రినియా అనే వ్యాధి వస్తుంది. విచిత్రమైన అనుమానాలు, భయభ్రాంతులు, వారిలో వారే మాట్లాడుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆనక్సిటీ అనే వ్యాధి సెరటోనిన్, అడ్రనలిన్ అనే రసాయన పదార్థాల హెచ్చుతగ్గులతో వస్తుంది. ఎసిట్రైల్ కోలిన్ అనే రసాయన పదార్థం తగ్గినపుడు మతిమరుపు వచ్చే అవకాశాలుంటాయి.

Read More: కొలెస్ట్రాల్‌ను ఇలా కంట్రోల్ చేయండి..!

అయితే.. మానసిక ఒత్తిడితో బాధపడేవారు.. సువాసనలను పీల్చడం ద్వారా ఉపశమనం పొందవచ్చని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు, యూపీఎంసీ సోషల్ వర్కర్స్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. నెగిటివ్ ఆలోచనలను అడ్డుకుని, ఆలోచనలను తిరిగి సరైన దారిలో పెట్టేందుకు ఈ తరహా ప్రక్రియ ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.

యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు, యూపీఎంసీ సోషల్ వర్కర్స్ నిర్వహించిన అధ్యయనంలో పాల్గొన్న వారికి విక్స్ వేపొరబ్, కొబ్బరినూనె, రెడ్ వైన్, కాఫీ, ఆవపొడి, వెనిల్లా ఎక్స్ ట్రాక్ట్, షూ పాలిష్, లవంగాలు, వంటనూనెలు, నారింజ పండ్లు, కెచప్ వంటి వాటిని వాసన చూపించి.. గతంలో తమ జీవితాల్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోవాలని పరిశోధకులు సూచించారు.

Read More: పొడవాటి గోళ్లు అంటే ఇష్టమా.. షాకింగ్ నిజాలు..!

మానసిక ఒత్తిడిలో ఉన్నవారిని మాటల ద్వారా కంటే.. సువాసనల ద్వారా ప్రోత్సహించినపుడు తేలిక అవుతారని పేర్కొన్నారు. ఈ వాసనలను చూసిన తర్వాత పాజిటివ్ మెమొరీస్ నే ఎక్కువగా గుర్తు చేసుకున్నారన్నారు.

Tags

Related News

Potato Face Packs: ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం !

Weight Gain Foods For Children: మీ పిల్లలు బరువు పెరగడం లేదా ? ఈ ఫుడ్స్ తినిపించండి

Aloe Vera Health Benefits: కలబందతో మతిపోయే ప్రయోజనాలు !

Lip Care Tips: పెదాలు ఎర్రగా మారడానికి చిట్కాలు ఇవే !

Barley Water Benefits: బార్లీ వాటర్‌తో అనారోగ్య సమస్యలు దూరం !

Chana Dal For Diabeties: డయాబెటీస్ ఉన్నవారికి శనగపప్పుతో ఉండే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..

Figs Side Effects: ఆరోగ్యానికి మంచిది అని అంజీర పండ్లను అతిగా తినేస్తున్నారా ?

Big Stories

×