EPAPER

Police Notice to ‘Gaanja Shankar’: గాంజా శంకర్ చిత్ర యూనిట్ కు షాక్.. నోటీసులిచ్చిన TS-Nab పోలీసులు

Police Notice to ‘Gaanja Shankar’: గాంజా శంకర్ చిత్ర యూనిట్ కు షాక్.. నోటీసులిచ్చిన TS-Nab పోలీసులు
Telugu film news

TS-Nab Sent Notice to Sai Dharam Tej’s Gaanja Shankar Movie: గంజాయి శంకర్ చిత్ర యూనిట్ కు టీఎస్ న్యాబ్ పోలీసులు నోటీసులు పంపారు. సినిమా టైటిల్ విద్యార్థులు,యువతపై తప్పుడు ప్రభావం చూపుతుందని.. అందువల్ల గాంజా అనే పదాన్ని తొలగించాలంటూ టీఎస్ న్యాబ్ పోలీసులు నోటీసులో సూచించారు. సినిమాలో మాదకద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతర సన్నివేశాలు ఉంటే ఎన్డీపీఎస్ 1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.


చిత్రంలో గంజాయి మొక్కల్ని చూపించడంతో పాటు ప్రోత్సహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని సాధారణంగా చూపే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గంజాయి సన్నివేశాలు, డైలాగులు లేకుండా చూడాలని టీఎస్ న్యాబ్ పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు. సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టులు, ఇతర సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో మెలగాలని నోటీసుల్లో పేర్కొంది.

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్ గాంజా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోని గంజాయి అమ్మేవాడిగా కనిపించాడు. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య.. గాంజా శంకర్ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణ సంస్థగా ఉంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


Read More: మమ్ముట్టి ‘భ్రమయుగం’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఎందులో, ఎప్పుడు వస్తుందంటే?

గతేడాది అక్టోబర్ 15న సాయిధరమ్ బర్త్ డే సందర్భంగా.. ఒక నిమిషం 39 సెకన్ల నిడివితో గాంజా శంకర్ ఫస్ట్ హై అంటూ విడుదల చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 10 గంటల వరకూ పార్కులో పడుకుంటాడు. 10 వేలుంటే పార్క్ హయత్ లో ఉంటాడని.. ఓ చిన్నారికి తన తండ్రి చెప్పే కథలో వచ్చే ఈ డైలాగ్ హైలైట్ గా నిలిచింది. సాయిధరమ్ తేజ్ గతంలో ఎన్నడూ చేయని పాత్ర ఈ సినిమాలో చేశాడు. తాజాగా పోలీసులు నోటీసులివ్వడంతో.. సినిమాలో చాలా మార్పులే చేయాల్సి ఉంటుందని సమాచారం.

Tags

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×