EPAPER

Odisha You Tuber : దినసరి కూలీ.. నేడు యూట్యూబ్ సెన్సేషన్

Odisha You Tuber : దినసరి కూలీ.. నేడు యూట్యూబ్ సెన్సేషన్
Odisha You Tuber

Isak Munda Odisha You Tuber : ఇసాక్ ముండా.. ఇప్పుడో ఇంటర్నెట్ సంచలనం. ఒడిసాలో అతనో దినసరి కూలీ. పొద్దంతా కష్టపడినా దక్కేది 250 రూపాయలే. దాంతోనే జీవనాన్ని వెళ్లదీసేవాడు. అంతలో కరోనా మహమ్మారి పిడుగులా వచ్చి పడింది. అతని కడుపు కొట్టింది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోవడంతో దిక్కుతోచలేదు. అప్పటి దాకా కాస్తో కూస్తో పైసలు చేతిలో ఉండేవి. కరోనా వల్ల చిల్లిగవ్వ లేకుండా పోవడంతో వేదనే మిగిలింది. కుటుంబాన్ని పోషించడం ఎలాగో తెలియక తల్లడిల్లిపోయాడు.


చివరకు యూట్యూబ్ అతనికి దారి చూపింది. వీడియోలు చేయడం ద్వారా ఆదాయం
పొందొచ్చన్న విషయం తెలుసుకున్నాడు ఇసాక్. ఒడిసా సంప్రదాయ వంటకాలపై వీడియోలు చేయడం ఆరంభించాడు. తొలిసారిగా మార్చి 2020లో ఓ వంటకం తయారీపై వీడియో చేశాడు. తొలినాళ్లలో ఆ వీడియోలు ఎవరినీ ఆకట్టుకోలేదు. అయినా పట్టు విడవలేదు ఇసాక్.

Rread more: పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. ఆ ఆరోపణలే కారణమా?


ఒడిసాలో అత్యధికులు ఇష్టపడే రైస్ వంటకంపై ఓ సారి వీడియో చేశాడు. అది వైరల్ కావడంతో.. ఇసాక్ ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డడు. క్రమేపీ అతని వీడియోలకు ఆదరణ పెరిగింది. యూట్యూబర్‌గా ఇప్పుడతనికి 20 వేల మంది అభిమానులున్నారు. ఇసాక్ గురించి ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రస్తావించడం విశేషం. అతని రోజు సంపాదన ప్రస్తుతం 3 లక్షల రూపాయలకు చేరింది. వీడియోలను అతనే స్వయంగా ఎడిట్ చేసుకుంటాడు.

దీని కోసం సొంతంగా లాప్‌టాప్‌ను సమకూర్చుకున్నాడు. అమెరికా, బ్రెజిల్, మంగోలియాల్లోనూ అతని వీడియోలకు క్రేజ్. దినసరి కూలీగా మారుమూల గ్రామంలో జీవనం సాగిస్తున్న తాను సోషల్ మీడియా స్టార్‌ను అవుతానని కలలోనైనా ఊహించలేదని అంటున్నాడు ఇసాక్ ముండా.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×