EPAPER

Bird Flu in Andhra Pradesh: బర్డ్ ఫ్లూ నియంత్రణపై ఫోకస్.. మూడ్రోజులు చికెన్ షాపులు బంద్!

Bird Flu in Andhra Pradesh: బర్డ్ ఫ్లూ నియంత్రణపై ఫోకస్.. మూడ్రోజులు చికెన్ షాపులు బంద్!
Bird Flu in Nellore District

Bird Flu in Nellore District: ఆదివారం వచ్చిందంటే చాలు. వీకెండ్ కోసం ఎదురుచూసే నాన్ వెజ్ ప్రియులకు పండుగ. నాన్ వెజ్ లవర్స్ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది చికెన్. చికెన్ తో చేసే రకరకాల వంటకాలను ఈ రోజు ఆస్వాదిస్తూ తింటారు. ఫంక్షన్లలోనూ చికెన్ దే టాప్ ప్లేస్. కానీ.. ఇప్పుడు చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. బర్డ్ ఫ్లూ రావడంతో నెల్లూరు జిల్లాలో చికెన్ షాపులను మూసివేయించారు అధికారులు.


నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ నియంత్రణకు చర్యలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా పొదలకూరు, కోవూరు మండలాల్లో ఈ వ్యాధి కారణంగా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అలర్ట్‌ అయిన అధికార యంత్రాంగం చికెన్‌ షాపులను మూడు రోజులపాటు బంద్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు దుకాణాల యజమానులతో సమావేశమై.. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రజలు కూడా జాగ్రత్త పాటించాలని సూచించారు. చికెన్‌ ఐటెమ్స్‌కు కొద్ది రోజులు దూరంగా ఉండాలని తెలిపారు.

Read More:  జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు


బర్డ్‌ఫ్లూ వ్యాపించిన ప్రాంతాల్లో ఆరోగ్యాధికారి వెంకట రమణ. నిల్వ ఉన్న చికెన్‌ను సీజ్‌ చేసి షాపులను మూయించారు. అధికారుల నుంచి ఆదేశాల వచ్చేంత వరకూ ఎవరూ చికెన్‌ కొనుగోలు, విక్రయాలు జరపవద్దని హెచ్చరించారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్‌లు, బార్‌లు, కర్రీస్‌ పాయింట్లలో చికెన్‌ విక్రయాలు జరపవద్దని కూడా ఆదేశించారు. చికెన్ తో పాటు కోడిగుడ్లను కూడా తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నాన్‌వెజ్‌ ప్రియులు ఇతర మాంసపు ఆహార పదార్థాలను తినాలని సూచించారు.

బర్డ్‌ఫ్లూ కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో కోళ్ల పెంపకందారులు ఆందోళన వ్యకం చేస్తున్నారు. తమకు భారీగా నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Related News

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Minister Kandula Durgesh: రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించండి.. నిర్మాతలకు మంత్రి మరోసారి ఆహ్వానం

Big Stories

×