EPAPER

Tirumala: తిరుమల శ్రివారి భక్తులకు గుడ్ న్యుస్.. రేపు టీటీడీ ఆర్జితసేవా టికెట్లు విడుదల

Tirumala: తిరుమల శ్రివారి భక్తులకు గుడ్ న్యుస్.. రేపు టీటీడీ ఆర్జితసేవా టికెట్లు విడుదల
latest telugu news

Tirumala Arjitaseva Tickets Booking News: వేసవి కాలంలో విద్యాసంస్థలకు సెలవులు ఉండటంతో చాలా మంది భక్తులు తిరుమల దర్శనానికి వెళ్తుంటారు. అలా వేసవి కాలంలో దర్శనానికి వెళ్లేవారికి టీటీడీ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.


సేవా టికెట్లు ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 12గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతయని చెప్పారు. టికెట్లు పొందిన వారు డబ్బు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ వర్చువల్‌ సేవా టికెట్ల కోటాను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారని తెలిపారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.


Read More: రాశిని బట్టి దర్శించాల్సిన జ్యోతిర్లింగాలు..!

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మే నెల‌కు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మే నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారని టీటీడీ అధికారులు చెప్పారు.

ఫిబ్రవరి 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను టీటీడీ అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారని తెలిపారు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి టికేట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Big Stories

×