EPAPER

Indian Currency Notes : నోట్లపై గాంధీ బొమ్మే ఎందుకు..!

Indian Currency Notes : నోట్లపై గాంధీ బొమ్మే ఎందుకు..!
History Of Indian Currency

History Of Indian Currency (india today news):


మన కరెన్సీ నోట్లపై బోసినవ్వుతో ఉన్న గాంధీ బొమ్మను చూసేఉంటాం. పది రూపాలయల నోటుతో మొదలుపెడితే.. రెండు రూపాయల నోటు దాకా దేని మీద చూసిన గాంధీ బొమ్మ కనిపిస్తుంది. అయితే ఇటీవల అంబేద్కర్‌ ఫొటో, రాముని ఫొటో ముద్రించాలని డిమాండ్లు వస్తున్నాయి.

అయితే గాంధీ ఫొటో కరెన్సీ నోట్లపై మొదటి నుంచి ప్రింట్ చేయడం లేదనే విషయం మీకు తెలుసా? స్వాతంత్రం వచ్చిన దాదాపు అర్థ శతాబ్ధం వరకు మన కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ ముద్రించలేదు. గాంధీ కన్నా ముందు ఎవరి ఫొటో ఉండేది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


Read More :  ఆదర్శనేత.. దామోదరం సంజీవయ్య..!

భారత దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్‌ పాలనలో ముద్రించిన కరెన్సీ నోట్లపై కింగ్‌ జార్జ్, క్వీన్‌ విక్టోరియా ఫొటోలు ముద్రించేవారు. చాలా ఏళ్లుగా ఇవే చలామణిలో ఉండేవి. 1947 ఆగష్టు 15న అర్థరాత్రి భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను ముద్రిస్తుంది.

ఆర్బీఐ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. భారత కరెన్పీ నోట్లపై చాలా ఏళ్లు ఎవరి ఫోటోలను ముద్రించలేదు. 1949లో భారత ప్రభుత్వం మొదటిసారి రూపాయి నోటుపై డిజైన్ చేసింది. దీనిపై గాంధీ బొమ్మను ముద్రించింది. కానీ దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అశోక స్తంభంతో నోట్లను ముద్రించారు.

1950లో అశోక స్తంభం డిజైన్‌తో మొదటి సారిగా రూ.2, రూ.5,రూ.10, రూ.100 నోట్లను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఇవన్నీ ఒకే డిజైన్‌లో ఉన్నప్పటికీ.. రంగులు వేరుగా ఉండేవి. నోట్లకు వెనుక వైపు పడవ బొమ్మలు ఉండేవి.

Read More : పేటీఎంకు రిలీఫ్.. మార్చి 15వరకు లావాదేవీలకు ఒకే చెప్పిన ఆర్బీఐ..

1954లో రూ.1000, రూ.2000, రూ.10,000 నోట్లను ముద్రించారు. వీటిని తిరిగి 1978లో రద్దు చేశారు. నోట్లపై చిన్నచిన్న మార్పులు తీసుకొచ్చారు. జింకలు, సింహాల నోట్లను ముద్రించారు. 1972లో రూ.20 నోటును, 1975లో రూ.50 నోటును తీసుకొచ్చారు.

1969లో గాంధీ శత జయంతి సందర్భంగా కరెన్సీ నోట్లపై తొలిసారిగా బాపూజీ బొమ్మను ముద్రించారు. సేవ్‌గ్రామ్ ఆశ్రమం వెనుక గాంధీ కూర్చొని ఉన్న చిత్రంతో రూ.100 ప్రత్యేక నోటును అచ్చు వేశారు. దీనికి ముందువైపు వ్యయసాయం, తేయాకు ఆకులు ముద్రించారు.

అలానే రూపాయి నోటుపై చ‌మురు బావి, రెండు రూపాయ‌ల నోటుపై ఆర్య‌భ‌ట్ట ఉప‌గ్ర‌హం, రూ.5 నోటుపై ట్రాక్ట‌ర్, పొలం. రూ.10 నోటుపై కోణార్క్ మందిరం చ‌క్రం, నెమ‌లి, శాలిమార్ గార్డెన్ ఫొటోలు ముద్రించడం ప్రారంభించారు. ఇప్పటికీ భారత ప్రభుత్వం గాంధీ ఫొటోతోనే నోట్లను ముద్రిస్తోంది.

1987లో తొలిసారిగా 500 రూపాయ‌ల నోటును ముద్రించారు. దీనిపై గాంధీ బొమ్మ‌, వాట‌ర్ మార్క్‌లో అశోక స్తంభాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంద్రించింది. 1996లో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న వాటితో పోలిస్తే కొత్త భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌తో గాంధీ సిరీస్ నోట్ల ముద్ర‌ణ ప్రారంభమైంది. వాట‌ర్ మార్క్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చేసింది.

అంధులు కూడా గుర్తుప‌ట్టేలా వీటి డిజైన్‌ చేశారు. 2000 సంవత్సరంలో నుంచి వెయ్యి నోట్లు ముద్రించ‌డం మొద‌లుపెట్టారు. కానీ 2016లో న‌రేంద్ర మోదీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పాత 500, 1000 నోట్ల‌ను ర‌ద్దు చేసి వాటి స్థానంలో కొత్త 500, 2000 నోటును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నోట్ల కూడా గాంధీ బొమ్మతోనే కొనసాగించారు.

ఇదిలా ఉండగా కరెన్సీ నోట్లపై గాంధీ ఒక్కరిదే కాకుండా.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ , సుభాష్‌ చంద్రబోస్, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, లాలా లజపతిరాయ్, బాలగంగాధర్‌ తిలక్ ఫొటోలు ముద్రించాలనే డిమాండ్లు ఉన్నాయి. ఇటీవల అయోధ్య రాముడి ఫొటోలు కూడా నోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ పెరుగుతోంది.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×