EPAPER

Dream Valley Hyderabad : చట్టానికి తూట్లు.. కంచర్లకు కోట్లు..!

Dream Valley Hyderabad : చట్టానికి తూట్లు.. కంచర్లకు కోట్లు..!
Dream Valley Hyderabad

‘Swechha’ Investigation Team, Hyderabad(TS news updates): బీఆర్ఎస్ హయాంలో కబ్జాలు, దందాలు లెక్కలేనన్ని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కొందరు గులాబీ నేతలు వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు పడగలెత్తారంటేనే అర్థం చేసుకోండి ఎంతలా అవినీతికి పాల్పడ్డారో. కాళేశ్వరం మాటున కొందరు, గచ్చిబౌలి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో మరికొందరు.. ఇలా ఏదో ఒకటి పట్టుకుని పది తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని పోగు చేశారు. అలా, 111 జీవో ఎత్తివేత అంటూ చేసిన ప్రచారంతోనూ వేల కోట్ల వ్యాపారానికి బీజం పడింది.


ఆ సమయంలో కేటీఆర్ తన అనుచరులతో అక్రమంగా విల్లాలు నిర్మించుకునేలా అనధికారికంగా అన్ని అనుమతులు ఇచ్చేశారు. దీంతో ఏ ఒక్క ఆఫీసర్ అటువైపు కన్నెత్తి చూడలేదు. హిమయత్ సాగర్ కి 2 కిలోమీటర్ల దూరంలో 16 ఎకరాల్లో 31 విల్లాలను నిర్మిస్తున్నాడు డ్రీమ్ వ్యాలీ ఓనర్ కంచర్ల సంతోష్ రెడ్డి. ఇక్కడి ఒక్కో విల్లా కళ్లు చెదిరేలా 15 వేల స్క్వేర్ ఫీట్స్ తో లగ్జరీగా ఉంటుంది. ధర అక్షరాలా 25 కోట్లు. కట్టుబట్టలతో వెళ్లి ఉండేలా ఇంటీరియర్ చేసి ఇస్తామని చెబుతారు. మోడల్ విల్లాను చూపించి టెమ్టింగ్ చేస్తారు. చుట్టూ పచ్చదనం ఉండటంతో అనధికారికంగా అయినా విల్లాను కొనాల్సిందే అనిపించేలా మైండ్ ని సెట్ చేస్తారు.

కంచర్ల కన్ను పడితే ఖతమే!


1996 లోనే మొయినాబాద్ లో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ పేరుతో భారీగా భూములు కొనుగోలు చేశాడు కంచర్ల సంతోష్‌ రెడ్డి. అజీజ్ నగర్ కి ఆనుకుని ఉండే బాకారం రెవెన్యూ శివార్లలో సర్వే నెంబర్ 78/8 లో 20 ఎకరాల్లో రిసార్ట్ ఉంది. 111 జీవోలో అనుమతులు లేకున్నా.. తనకున్న పరిచయాలు, పవర్స్ తో కాలానికి అనుకూలంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టాడు. అధికారులు, నేతలు అందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు కానీ, చట్టం, న్యాయస్థానం తీర్పులు మాత్రం గుర్తుకురావు. ఇదే అదునుగా ఇమ్యాజిన్ విల్లాస్ పేరుతో 16 ఎకరాలను కాంక్రీట్ జంగిల్ గా మార్చారు. 20 ఫీట్ల రోడ్డుతో 20 గుంటల్లో ఒక్కొక్క విల్లా నిర్మిస్తున్నారు.

సంతోష్ రెడ్డి ఏదైనా అనుకుంటే జరిగి తీరాల్సిందే. అధికారులను రిసార్ట్ కు పిలిచి విందు, వినోదాలతో ఖుషీ చేస్తాడని టాక్. అనుకున్న పనిని ఎలా అయినా అయ్యేలా జిమ్మిక్కులు చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. రూల్ ప్రకారం 10 శాతంలోనే నిర్మాణం చేపట్టాలని ఉంటే.. 10 శాతం ఖాళీ ప్లేస్ ఉంచి 90 శాతం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టాడంటేనే అర్థం చేసుకుంటో ఇతనికి ఎంత ధైర్యమో.. ఆ ధైర్యం వెనుక ఎవరున్నారో. మాజీ మంత్రి కేటీఆర్ తన టీం ని అర్థికంగా బలపర్చుకోవడానికి ఇలాంటి వారిని అక్రమాలకు ప్రొత్సహించారు. 111 జీవోలోని భూములను కొల్లగొట్టి అర్థికంగా బలపడటానికి పక్కా ప్లాన్స్ రెడీ చేసుకున్నారు.

మాయమాటలతో ఎవరెవరికి అమ్మారంటే..!

లంచాలకు, అవినీతికి అలవాటు పడి బ్లాక్ మనీని విల్లాల రూపంలోకి తెచ్చుకుంటున్నారు బడా బాబులు. 25 కోట్లు ఎలాంటి బ్యాంకు రుణం లేకుండానే విల్లాను కొనుగోలు చేస్తున్నారు. అక్రమంగా 500 నుంచి 1000 గజాల లోపు తీసుకున్నట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సెటిల్మెంట్ డీడ్ లా బినామీల పేర్ల మీదకి మార్చుకుంటున్నారు. వ్యవసాయ భూమిని రెసిడెన్షియల్ గా మార్చి పలుమార్లు డాక్యుమెంట్స్ అయినట్లు చూపిస్తున్నారు. మనోజ్ కుమార్, రాధా రెడ్డి, సిద్దిఖీ, పరినీత్ రెడ్డి, గొంగులూర్ విజయ్ కుమార్, రఘునాథ్ రెడ్డి, జీ ఉమేష్ చంద్ర, రెహానా సుల్తానా ఇలా కొంతమంది విల్లాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

బండారం బయట పెట్టేందుకు ‘స్వేచ్ఛ’ రెడీ

ప్రభుత్వంలో ఉంటే ఏదైనా చేయవచ్చు అని బరి తెగించి అక్రమాలకు పాల్పడ్డ వారి భరతం పట్టేందుకు ‘స్వేచ్ఛ’ రెడీగా ఉంది. స్కాములకు పాల్పడ్డ వారి పట్ల సింహస్వప్నంగా రాబోతోంది. స్వేచ్ఛాయుత వాతవరణంలో వార్తలను లోతుగా దర్యాప్తు చేసి అక్రమాలను, అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధమైంది. ఇక నుంచి రోజూ ఎక్స్ క్లూజివ్ కథనాలతో మీ ముందుకు రానుంది.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×