EPAPER

India Vs England 3rd Test Updates: మూడో టెస్ట్‌లో మెరుపులు-మరకలు..

India Vs England 3rd Test Updates: మూడో టెస్ట్‌లో మెరుపులు-మరకలు..

India Vs England 3rd Test Updates: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కొన్ని మెరుపులు మెరిశాయి.  ఇంగ్లాండ్ బ్యాటింగులో ఓపెనర్  బెన్ డక్కెట్ బజ్‌బాల్ బ్యాటింగ్‌తో 88 బంతుల్లోనే సెంచరీ  చేశాడు. దీంతో భారత్‌ గడ్డపై అత్యంత వేగంగా సెంచరీ చేసిన తొలి ఇంగ్లండ్ ప్లేయర్‌గా నిలిచాడు.


ఓవరాల్‌గా చూస్తే మూడో ప్లేయర్‌గా ఉన్నాడు. తనకన్నా ముందు భారత్‌పై స్పీడుగా సెంచరీ చేసిన వారిలో గిల్ క్రిస్ట్ (84 బంతులు), క్లైవ్ లాయిడ్ (85 బంతులు) ఉన్నారు.

ఇక టీమ్ ఇండియా నుంచి చూస్తే ఒక మెరుపులాంటి రివ్యూ తీసుకున్నారు. 30 ఓవర్‌లో సిరాజ్ వేసిన ఇన్ స్వింగర్ ఒలిపోప్ ప్యాడ్లను తాకింది. భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. కానీ అంపైర్ నాటౌట్ అన్నాడు. సిరాజ్ మాత్రం రివ్యూ కావల్సిందేనని పట్టుపట్టాడు. చేసేది లేక రోహిత్ శర్మ సరే అన్నాడు.  చివరికి అది అవుట్ అని తేలడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.


ముచ్చటగా మూడో సంతోషకరమైన వార్త ఏమిటంటే సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్‌‌కి మంచి గిప్ట్ వచ్చింది. బిజినెస్ మేన్ ఆనంద్ మహీంద్రా అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు. కొడుకుని తీర్చిదిద్దిన తీరు స్ఫూర్తిదాయకమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అంతేకాదు థార్ ఎస్‌యూవీ కారును బహుమతిగా అందజేయనున్నట్టు తెలిపారు.

Read More: ఇంగ్లాండ్ బజ్ బాల్ వ్యూహం : ఒత్తిడిలో టీమ్ ఇండియా?

నాల్గవ సంగతి ఏమిటంటే, అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోసినిమాతో అశ్విన్ మాట్లాడుతూ.. ముందుగా ఈ 500 వికెట్ల ఘనతను మా నాన్నకు అంకితం చేస్తున్నానని తెలిపాడు. 

ఈ రోజు నేను ఇలా ఆడుతున్నానంటే అందుకు ఆయనే కారణమని తెలిపాడు. నన్నెంతో ఎంకరేజ్ చేశారని అన్నాడు. ఒకొక్కసారి నా ఆట చూసి, ఇలా ఆడుతున్నావేట్రా? అని నెత్తి కొట్టుకునేవారు. ఒకొక్కసారి హై బీపీ కూడా వచ్చేసేదని సరదాగా కామెంట్ చేశాడు.

ఐదో సంగతి.. ఇక ధృవ్ జురెల్ అయితే, ఒక చక్కని అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డ్ సృష్టించేవాడు. 4 పరుగుల దూరంలో చక్కని అవకాశాన్ని చేజార్చుకున్నాడు. పాపం ధృవ్ అంటూ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×