EPAPER

AP Fibernet Case: ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు.. ఏ1గా చంద్రబాబు!

AP Fibernet Case: ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు.. ఏ1గా చంద్రబాబు!
chandrababu in fibernet case

Charge Sheet on Chandrababu in Fibernet Case: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. A-1గా టిడిపి అధినేత చంద్రబాబును, A-2గా వేమూరి హరికృష్ణ పేర్లను సీఐడీ నమోదు చేసింది. ఇక A-3గా కోగంటి సాంబశివరావును చేర్చింది. ఐపీసీ 166,167,418, 465, 468, 471, 409, 506, రెడ్ విత్ 120(బి), ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టంలోని 13(2), రెడ్ విత్ 13(1)(సీ)(డీ) సెక్షన్ల కింద ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఇందుకు సంబంధించిన ఛార్జిషీటును శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. అందులో.. ఫైబర్ నెట్ మొదటిదశలో కుంభకోణం జరిగినట్లుగా పేర్కొన్నారు.


చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు.. నేరపూరితమైన ఆలోచనతోనే గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా వి.హరికృష్ణప్రసాద్ ను నియమించారని, ప్రాజెక్ట్ అంచనా, వస్తువులకు మార్కెట్లో ఉన్న ధరలను పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చారని ఛార్జిషీటులో పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి మరీ బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి టెండర్ ను కట్టబెట్టారని, మిగతా టెండర్ దారులు గొడవ చేయకుండా టెర్రాసాఫ్ట్ కంపెనీ వారికి ముడుపులు ఇచ్చిందని తెలిపారు.

Read More: కుర్చీ మడతపెడితే.. నారా లోకేశ్ మాస్ డైలాగ్..


ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కోగంటి సాంబశివరావు.. గతంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీగా, ఇన్ క్యాప్ వీసీ ఎండీగా వ్యవహరించారు. ఆయన ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియను తారుమారు చేశారని, టెండర్లు ముగిసే రోజున బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ ను లిస్టులో నుంచి తొలగించి, టెండర్ ను ఆ కంపెనీకి కట్టబెట్టారని పేర్కొన్నారు. ఫైబర్ నెట్ లో మొత్తం రూ.330 కోట్ల వరకూ మేలు జరిగేలా అధికారులు వ్యవహరించారని సీఐడీ ఆరోపించింది.

ఇందులో టెరామీడియా క్లౌడ్ కంపెనీకి అనుబంధం ఉందని, హరికృష్ణప్రసాద్ భాగస్వామి అని, చంద్రబాబు చెప్పినట్లే ఆయన చేశారన్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ సీనియర్ అధికారులను కోర్టుముందు ప్రవేశపెట్టామన్న సీఐడీ .. ఆ తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు తెలిపింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ఆయన్ను విచారించేందుకు అనుమతివ్వాలని పీటీవారెంట్ ను దాఖలు చేసినట్లు చెప్పిందది. ప్రస్తుతం ఈ రెండు కేసులో ఏసీబీ కోర్టులో ఉండగా.. బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు, హైకోర్టు తోసిపుచ్చడంతో.. సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ పెట్టుకున్నారని, అది పెండింగ్ లో ఉందని సీఐడీ చార్జిషీటులో తెలిపింది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×