EPAPER

Rajadhani Files Review : వివాదాల నడుమ వచ్చిన “రాజధాని ఫైల్స్”.. ఎలా ఉందంటే ?

Rajadhani Files Review : వివాదాల నడుమ వచ్చిన “రాజధాని ఫైల్స్”.. ఎలా ఉందంటే ?
Rajadhani Files Movie Review

Rajadhani Files Movie Review (film review):


రాజధాని అంశం ఎటూ తేలడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక.. నాటి ప్రభుత్వం ఒక రాజధానిని ప్రకటిస్తే.. ఆ తర్వాత ప్రభుత్వం మారగా..రాజధాని అంశం రివర్సైంది. మూడు రాజధానులను ప్రటించడంతో.. కళ్లముందున్న రాజధాని ప్రజల కలలన్నీ కల్లలయ్యాయి. కడుపులో పెరుగుతున్న బిడ్డపై గొడ్డలితో వేటు వేసిన కర్కశత్వంలా.. ఒక్కరి అహానికి కోట్లాదిమంది కలలు, వేలమంది రైతుల కుటుంబాల జీవితాలను కాలరాసినట్లైంది. తమకు న్యాయం చేయాలంటూ రైతులు ఉద్యమ బాట పట్టి.. కోర్టులు మొదలు.. దేవాలయాల వరకూ వెళ్లి తమ ఆక్రందనను చెప్పుకున్నారు. ఇప్పటికీ రాజధాని అంశంపై ఒక స్పష్టత లేదు. రాజధాని రైతుల ఉద్యమం ఆధారంగా తీసిన చిత్రమే ఈ రాజధాని ఫైల్స్. ఈ సినిమా విడుదలకు కొందరు అభ్యంతరం చెప్పగా.. తాజాగా హైకోర్టు సినిమా విడుదలపై ఇచ్చిన స్టే ను ఎత్తివేయడంతో.. పూర్తిస్థాయిలో సినిమా విడుదలైంది.

సినిమా – రాజధాని ఫైల్స్


నటీనటులు – వీణ, వినోద్ కుమార్, అఖిలన్, వాణి విశ్వనాథ్, పవన్, విశాల్, షణ్ముఖ్, అంకిత, అమృత తదితరులు

మ్యూజిక్ – మణిశర్మ

సినిమాటోగ్రఫీ – రమేష్

డైలాగ్స్ – అనిల్ అచ్చుగట్ల

నిర్మాత – కంఠంనేని రవిశంకర్

నిర్మాణ సంస్థ – తెలుగువన్ ప్రొడక్షన్స్

కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – భాను

విడుదల – ఫిబ్రవరి 15 , 2024

Read More : భామాకలాపం 2.. కష్టాల్లో ఉన్న ప్రియమణి గట్టెక్కిందా ?

కథ

అరుణప్రదేశ్ లో కత్తిగుర్తు కె.ఆర్.ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. అయిరావతిపై కత్తితో వేటు వేస్తుంది. ఎవరో కన్నబిడ్డకు మీరు తండ్రిగా ఉండటమేంటంటూ.. రాజకీయ వ్యూహకర్త చెప్పిన మాటను చెవికెక్కించుకున్న సీఎం.. అధికార వికేంద్రీకరణ అంటూ నాలుగు రాజధానుల పల్లవిని అందుకుంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయిరావతి నిర్మాణాన్ని.. సమ్మతించిన అదే వ్యక్తి.. అధికారంలోకి రాగానే మాట మార్చడంతో.. రాజధాని కోసం అమ్మలా చూసుకున్న భూముల్ని ఇచ్చేసిన రైతులు ఆందోళన బాటపడతారు.

అధికార బలంతో.. ఆందోళన చేస్తున్న రైతులపై ఉక్కుపాదం మోపుతాడు సీఎం. ఆయనకు మరో ఇద్దరు ఎంపీలు తోడై.. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతారు. ఎంతోమంది ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతారు. అయినప్పటికీ ధైర్యం కోల్పోని రైతులు న్యాయం కోసం తమ ఉద్యమాన్ని కొనసాగించినా.. సీఎం కరగడు. ఆ సమయంలో అరుణప్రదేశ్ లో ఉన్న ఏపీ ప్రజలు ఏం చేశారు ? ముఖ్యమంత్రికి ఎలా బుద్ధి చెప్పారు? రైతులకు మద్దతుగా ఉన్న ఒక కుటుంబం.. ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించారన్నదే మిగతా కథ. ఇదంతా తెలియాలంటే “రాజధాని ఫైల్స్” ను తెరపై చూడాల్సిందే..

ఎలా ఉంది ?

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తన అహంతో అడ్డుకుంటే.. ప్రజలు ఎలాంటి బుద్ధి చెబుతారో కళ్లకు కట్టినట్లు చూపించే సినిమా ఇది. రాజధాని పరిధిలో ఉండే.. వెలగగూడెంలోని పచ్చని పంటపొలాలు, వాటితో రైతన్నలకు తరతరాలుగా ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ కథను ప్రారంభిస్తాడు డైరెక్టర్. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతుల శాంతియుత పోరాటంపై.. అధికారంలో ఉన్న సీఎం బలాన్ని ప్రదర్శించే తీరు, ఈ క్రమంలో మహిళలంతా ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేయడం.. సినిమాను ఆసక్తికరంగా మారుస్తుంది. ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా.. తమ ఆక్రందనను పాలకులు పట్టించుకోకపోవడం.. ఆఖరికి తమ గళాన్ని బయటకు వినిపించకుండా.. అడ్డుకోవడం, ఉద్యమంలోనే కొందరు రైతులు ప్రాణాలు కోల్పోవడం వంటి సీన్స్ గుండెను పిండేస్తాయి. రైతుల ఆవేదనలో ఎంత నిజాయితీ ఉందో చెప్పే సినిమా ఇది. సినిమాలో పాత్రలే తప్ప.. నటీనటులు కనిపించరు. రైతు ప్రతినిధులుగా, దంపతులుగా వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు.

ప్లస్ పాయింట్స్

యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన కథ

భావోద్వేగాలు

డైలాగ్స్

నటీనటులు

పతాక సన్నివేశాలు

మైనస్ పాయింట్స్

మొదటి సన్నివేశాలను ఆవిష్కరించడంలో తడబాటు

చివరిగా.. రాజధాని రైతుల ఆవేదన.. “రాజధాని ఫైల్స్

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×