EPAPER

Big Update For Paytm FASTag Users: ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు అప్‌డేట్.. బ్యాంకుల జాబితాలో పేటీఎం ఉందా?

Big Update For Paytm FASTag Users: ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు అప్‌డేట్..  బ్యాంకుల జాబితాలో పేటీఎం ఉందా?

Paytm is Not In List Of Banks That Issue New FASTags: పేమెంట్స్ బ్యాంక్‌పై ఆంక్షలతో పేటీఎంకు కష్టలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల కోసం పెద్ద అప్‌డేట్‌. తాజాగా ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్‌ను తొలగించింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తరఫున టోల్‌ రుసుము చెల్లించే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.


తాము పేర్కొన్న బ్యాంక్ నుంచే ఫాస్టాగ్ కొనగోలు చేయాలని యూజర్లకు తెలిపింది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయోచ్చు అని చెప్పింది. రోడ్ హైవే టోల్ అథారిటీ వినియోగదారులు 32 బ్యాంకుల జాబితాను పేర్కొంటూ ఆమోదించిన బ్యాంకుల నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లను తీసుకోవాలని సిఫార్సు చేసింది. అయితే ఈ జాబితా నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను మినహాయించింది.

దీంతో 20 మిలియన్లకు పైగా పేటీఎం ఫాస్ట్‌గ్ వినియోగదారులు ఇప్పుడు కొత్త ఆర్ఎఫ్‌డీ స్టిక్కర్లను పొందాలి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొద్ది రోజుల క్రితం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కి కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. ఫిబ్రవరి 29 నుంచి వినియోగదారు ఖాతాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లతో పాటు ఇతర సాధనాల్లో డిపాజిట్లు లేదా టాప్అప్‌లు తీసుకోవడం మానేయాలని రుణదాతను ఆదేశించింది.


ఇంతకు ముందే ఖాతాల్లో సొమ్ము ఉంటే అది అయిపోయేంత వరకు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఐహెచ్‌ఎంసీఎల్‌, ఆర్‌బీఐ ఆంక్షలతోనే ఈ తాజా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఫాస్టాగ్‌ యూజర్లంతా ఆర్‌బీఐ సూచనల ప్రకారమే తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఐహెచ్‌ఎంసీఎల్‌‌ను కోరుతున్నారు.

Tags

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×