EPAPER

DK Family: చిత్తూరు జిల్లాలో పొలిటికల్ డ్రామా.. హాట్ టాపిక్ గా మారిన డీకే ఫ్యామిలీ రాజకీయం..

DK Family: చిత్తూరు జిల్లాలో పొలిటికల్ డ్రామా.. హాట్ టాపిక్ గా మారిన డీకే ఫ్యామిలీ రాజకీయం..

DK family politics in Chittoor district: చిత్తూరు జిల్లా పారిశ్రామిక దిగ్గజం అయిన డీకే ప్యామీలి పాలిటిక్స్ ఎవరికీ అంతుపట్టకుండా తయారయ్యాయి. టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు కుటుంబంలో.. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో కనిపిస్తున్నారు. దివంగత డీకే కూమారుడు డీకే శ్రీనివాస్ వైసీపీ నాయకులతో టచ్‌లో ఉంటే , కూమార్తె తేజస్విణి టీడీపీకి దగ్గరగా కనిపిస్తున్నారు. ఇక ఆయన మనవరాలు చైతన్య జనసేనలో చేరారు. దాంతో వారిలో ఎవరు ఎన్నికల బరిలోకి దిగుతారనేది చిత్తూరులో హాట్ టాపిక్‌గా మారింది.


బడా పారిశ్రామికవేత్త అయిన డీకే ఆదికేశవుల నాయుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనదైన బ్రాండ్ వేసుకోగలిగారు. చిత్తూరు పార్లమెంటు సభ్యుడిగా, టీటీడీ చైర్మన్ గా పనిచేయడమే కాకుండా కర్నాటక, ఏపి రాజకీయాలలో చక్రం తిప్పిన దిగ్గజం.. అన్ని పార్టీలకు సహాయ సహాకారాలు అందిస్తూ వచ్చిన ఆయన.. ఎంపీగా ఉన్నప్పుడు పార్టీ విప్‌ని ధిక్కరించి టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. అయితే డీకే సతీమణి సత్యప్రభ సైతం 2014లో టీడీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీలో యాక్టివ్ పాత్ర పోషించారు. ఆ దంపతుల మరణం తర్వాత రాజకీయాలకు దూరమైన ఆ కుటుంబ సభ్యులు. ఎన్నికల సమీపిస్తున్న వేళ తిరిగి చిత్తూరు నగరంలో యాక్టివ్ అయ్యారు.

ఆదికేశవులనాయుడి కూమారుడు డీకే శ్రీనివాస్ తాను ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించారు. డిసెంబర్ , జనవరిల్లో చిత్తూరులో హడావుడి చేశారు. ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తర్వాత శ్రీనివాస్‌ను మంత్రి పెద్దిరెడ్డితో పాటు వైసీపీ నాయకులు కలిసి తమ పార్టీలోకి ఆహ్వానించారంట. ప్రస్తుతం శ్రీనివాస్ సైలెంట్ అవ్వడంతో.. ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి సంకేతాలు రావడం లేదు. పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై క్లారిటీ వచ్చాక.. ఆయన బయటకు వస్తారంటున్నారు.


ఇక డీకే మనవరాలు చైతన్య ముందుగా టీడీపీ టికెట్ అశించారు. భర్త డాక్టర్ రాజేష్ నాయుడితో కలిసి కాళహస్తి టికెట్ కోసం చంద్రబాబును కలిసి వచ్చారు. మరక్కడ ఏం జరిగిందో? ఏమో? కాని జనసేన కార్యాలయానికి సింగిల్‌గా వెళ్ళి జనసేన కండువా కప్పుకున్నారు. ఆమె భర్త మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. జనసేనలో చేరిన చైతన్య మదనపల్లి, చిత్తూరు జనసేన శ్రేణులతో కలసి వివిధ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఆ రెండు సెగ్మెంట్లలోఒక చోట నుంచి పోటీ చేస్తానంటున్నారు.

తాజాగా డికే ఆదికేశవుల నాయుడి పెద్ద కూమార్తె తేజస్విణి కూడా రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. జీడి నెల్లురులో ఇటీవల జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు హజరై అయనను కలిశారు. తర్వాత పార్టీ నాయకులతో చర్చలు కొనసాగిస్తున్నారు. త్వరలోనే ఆమె మళ్లీ టీడీపీ అధినేతను కలిసి.. ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇస్తారని అమె సన్నిహితులు చెప్తున్నారు.

మొత్తం మీద కుటుంబంలోని ముగ్గురు మూడు పార్టీలతో టచ్‌లో ఉండటం ఆసక్తికరంగా తయారైంది. వారితో పాటు డీకే సోదరుడు బద్రినారాయణ సైతం ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారంట. అవకాశం దొరికితే టీడీపీ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారంట. ఈ ఫ్యామిలీ పాలిటిక్స్‌తో డీకే అభిమానులకు అసలేం జరుగుతుందో అర్థకాకుండా తయారైందంట. 2019 ఎన్నికల సమయంలో డీకే శ్రీనివాస్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు అన్ని పార్టీలు అఫర్ ఇచ్చాయి. అప్పట్లో నిరాకరించిన వారు ఇప్పుడు పోటీకి సిద్దమవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Read More: ఇసుక దోపిడీని ప్రశ్నిస్తే దాడి చేస్తారా..? వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బాబు..

చిత్తూరు టీడీపీలోని ఒక బలమైనా వర్గం నేతల ఒత్తిడితోనే.. డీకే ఫ్యామిలీ తిరిగి పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైందన్న ప్రచారం జరుగుతోంది. ఆదికేశవులనాయుడు టైం నుంచి.. చిత్తూరు నగర టీడీపీ ఆ ప్యామిలీ మీదే ఆధారపడి ఉంది. వారు జిల్లాలో ప్రభావితంగా ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు అవ్వడం.. ఆ కమ్యూనిటీపై వారికున్న పట్టు.. ఆ కుటుంబానికి చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలు.. ఆర్ధిక లెక్కలతో జిల్లా టీడీపీలో వారి ప్రాబల్యమే కొనసాగుతుంది.

ఆ ఫ్యామిలీ పాలిటిక్స్‌కి దూరమవ్వడంతో 2019 ఎన్నికల్లో టీడీపీకి చిత్తూరు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. దాంతో జిల్లా సీనియర్లు మళ్లీ వారిని యాక్టివ్ చేసే పనిలో పడ్డారంటున్నారు. అదీకాక చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ టికెట్ కోసం ఏకంగా అరడజను మంది పోటీ పడుతున్నారు. వారిలో ఒకరి హాడావుడి మరీ ఎక్కువైంది. సదరు నేతలంగా సొంత వర్గాలు మెయిన్‌టెయిన్ చేస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. సదరు ఆశావహులకు చెక్ పెట్టి.. పార్టీని ఏకతాటిపైకి తేవడానికే డీకే కుటుంబం చూస్తున్నారంట టీడీపీ నేతలు. మరోవైపు బలిజ సామాజికవర్గానికి వైసీపీ రాయలసీమలో ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. దాంతో ఆ వర్గం నేతలు రగిలిపోతున్నారు.. వైసీపీకి తగిన గుణపాఠం చెప్తామని ప్రకటిస్తున్నారు.

ఇప్పుడా వర్గాన్ని ఓన్ చేసుకోవడానికే.. జనసేన, టీడీపీ జిల్లా నేతలు డీకే కుటుంబసభ్యుల్ని కలిసారని.. అందుకే తేజస్విని జనసేనలో చేరారంటున్నారు. మరి డీకే కుటుంబంలోని రెండో తరం నిర్ణయాలు ఎలా ఉంటాయో కాని.. ఆ పెద్దాయన మనవరాలు చైతన్య మాత్రం జనసేన నుంచి మదనపల్లి, చిత్తూరుల్లో ఒక స్థానం నుంచి పోటీలో ఉంటానని హడావుడి చేస్తున్నారు. మరి పొత్తుల లెక్కలు ఎలా ఉంటాయో? డీకే ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో? చూడాలి.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×